iDreamPost

RCBని గెలిపించిన ధోని.. మాహీ ఆ సిక్స్ కొట్టకపోతే CSK నెగ్గేది!

  • Published May 19, 2024 | 12:26 PMUpdated May 19, 2024 | 12:26 PM

కీలక మ్యాచ్​లో చెన్నైని గెలిపించి ప్లేఆఫ్స్​కు తీసుకెళ్తాడని లెజెండ్ ఎంఎస్ ధోని మీద ఎల్లో ఆర్మీ గంపెడాశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లే అతడు కూడా ఆఖరి దాకా పోరాడాడు. కానీ అతడి కాంట్రిబ్యూషన్ సీఎస్​కేకు కాకుండా ఆర్సీబీకి బిగ్ హెల్ప్ చేసింది.

కీలక మ్యాచ్​లో చెన్నైని గెలిపించి ప్లేఆఫ్స్​కు తీసుకెళ్తాడని లెజెండ్ ఎంఎస్ ధోని మీద ఎల్లో ఆర్మీ గంపెడాశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లే అతడు కూడా ఆఖరి దాకా పోరాడాడు. కానీ అతడి కాంట్రిబ్యూషన్ సీఎస్​కేకు కాకుండా ఆర్సీబీకి బిగ్ హెల్ప్ చేసింది.

  • Published May 19, 2024 | 12:26 PMUpdated May 19, 2024 | 12:26 PM
RCBని గెలిపించిన ధోని.. మాహీ ఆ సిక్స్ కొట్టకపోతే CSK నెగ్గేది!

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో బ్యాటర్​గా, కెప్టెన్​గా తిరుగులేని రికార్డులు అతడి సొంతం. మెగా లీగ్​లో టన్నుల కొద్దీ పరుగులు బాదిన అతడు.. ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. అతడే మహేంద్ర సింగ్ ధోని. సారథిగా చెన్నై సూపర్ కింగ్స్​ను 5 సార్లు ఛాంపియన్​గా నిలబెట్టాడతను. దాదాపుగా ప్రతి సీజన్​లో కనీసం ప్లేఆఫ్స్ వరకు వెళ్లడం సీఎస్​కేకు అలవాటు చేశాడు. ఎంత కఠిన పరిస్థితుల్లోనూ బ్యాటర్​గా ఆఖర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్​లతో మ్యాచ్​ను చెన్నై వైపు తిప్పడం మాహీకి వెన్నతో పెట్టిన విద్య. కెప్టెన్​గా సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్థుల చేతుల్లో నుంచి మ్యాచ్​ను లాక్కోవడం అతడికి అలవాటుగా మారింది. అలాంటోడు ఈ సీజన్​లో మరోసారి మ్యాజిక్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ధోని కాంట్రిబ్యూషన్ వల్ల సొంత జట్టు కాకుండా అపోజిషన్ టీమ్ నెగ్గింది.

ఆర్సీబీతో నాకౌట్ పోరులో చెన్నైని గెలిపించి ప్లేఆఫ్స్​కు తీసుకెళ్తాడని లెజెండ్ ఎంఎస్ ధోని మీద ఎల్లో ఆర్మీ గంపెడాశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లే అతడు కూడా ఆఖరి దాకా పోరాడాడు. కానీ అతడి కాంట్రిబ్యూషన్ సీఎస్​కేకు కాకుండా ఆర్సీబీకి బిగ్ హెల్ప్ చేసింది. సీఎస్​కే ఇన్నింగ్స్​ ఆఖరి ఓవర్ అది. విజయానికి 6 బంతుల్లో 17 పరుగులు చేయాలి. యష్ దయాల్ వేసిన తొలి బంతికే భారీ సిక్స్ బాదాడు మాహీ. అది కాస్తా వెళ్లి చిన్నస్వామి స్టేడియం అవతల పడింది. ఆ బాల్ 110 మీటర్ల దూరం వెళ్లడంతో కనిపించకుండా పోయింది. దీంతో కొత్త బాల్​ తెప్పించారు అంపైర్లు. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది. పాత బంతిని అలవోకగా బౌండరీలు, సిక్సులకు తరలించిన ధోని-జడ్డూ కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డారు.

సిక్స్ కొట్టిన తర్వాతి బాల్​ను ఎదుర్కొన్న ధోని.. మరో బిగ్ షాట్​కు ప్రయత్నించాడు. కానీ ఎలివేషన్ దొరక్కపోవడంతో క్యాచ్ ఔటై క్రీజును వీడాడు. కొత్త బంతితో బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్​ బాల్​ను సరిగ్గా వేశాడు బౌలర్ యష్ దయాల్. అప్పటివరకు ఉన్న పాత బంతితో అతడు బౌలింగ్ వేసేందుకు ఇబ్బందులు పడ్డాడు. గ్రౌండ్​లో ఉన్న తేమ వల్ల బంతి మీద పట్టు దొరక్కపోవడంతో అనుకున్నంత బాగా బౌలింగ్ చేయలేకపోయాడు. కానీ కొత్త బంతి దొరకగానే తన ప్రతాపం చూపించాడు. సిక్స్ కొట్టిన ఊపులో మరో రెండు షాట్లతో మ్యాచ్​ను ముగించేద్దామని మాహీ ఫిక్స్ అయ్యాడు. కానీ రాంగ్ షాట్​తో ఔట్ అయ్యాడు. అంతకుముందు ధోని బాల్​ను బయటకు కొట్టకపోతే కొత్త బంతి వచ్చేది కాదు, ఆర్సీబీ నెగ్గేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన చేజేతులా బెంగళూరును మాహీ గెలిపించాడని అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని డ్రెస్సింగ్ రూమ్​లో దినేష్ కార్తీక్ కూడా వ్యక్తం చేశాడు. ధోని సిక్స్ కొట్టి చేసిన సాయం వల్లే టీమ్ గెలిచిందన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి