Nidhan
ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇవాళ సాయంత్రం జరగనున్న ఈ పోరులో ఆర్సీబీ గెలుపుకు అదొక్కటే అడ్డంకిగా మారింది.
ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇవాళ సాయంత్రం జరగనున్న ఈ పోరులో ఆర్సీబీ గెలుపుకు అదొక్కటే అడ్డంకిగా మారింది.
Nidhan
ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా కప్పు కొట్టని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ చెత్త రికార్డు ఆ టీమ్ ఫ్యాన్స్‌ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ వస్తోంది. టైటిల్ రేసులో పలుమార్లు ఆఖరి వరకు వచ్చినా టైటిల్‌ను కైవసం చేసుకోలేకపోయింది ఆర్సీబీ. ఈ సీజన్లో మొదట్లో వరుస ఓటములతో డీలా పడిపోయింది. దీంతో ఈసారి కూడా కప్పు పోయినట్లేనని అంతా అనుకున్నారు. కానీ బౌన్స్ బ్యాక్ ఇచ్చిన డుప్లెసిస్ సేన.. ఒక్కో మ్యాచ్‌ను టార్గెట్‌గా పెట్టుకొని గెలుస్తూ ప్లేఆఫ్స్ ముంగిట నిలిచింది. ఇవాళ సీఎస్కేను భారీ తేడాతో ఓడిస్తే ఆ టీమ్ క్వాలిఫై అవడం గ్యారెంటీ. అయితే బెంగళూరు విజయానికి ఒకటే అడ్డంకిగా ఉంది. దాన్ని దాటితే గానీ తుది దశకు చేరుకోలేదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చెన్నైతో మ్యాచ్ అనగానే ఒక విషయంలో బాగా భయపడుతోంది బెంగళూరు. అతడు గానీ క్రీజులో సెటిల్ అయ్యాడా తమ నుంచి మ్యాచ్‌ను లాక్కొని వెళ్లిపోతాడని వణుకుతోంది. ఎలాగైనా సరే అతడ్ని ఆపాలని చూస్తోంది. కోహ్లీ టీమ్‌ను అంతగా టెన్షన్ పడుతున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు సీఎస్కే నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్-2024లో భీకర ఫామ్‌లో ఉన్నాడతను. ఇప్పటిదాకా ఆడిన 13 మ్యాచుల్లో కలిపి 141 స్ట్రైక్ రేట్‌తో 583 పరుగులు చేశాడు. 4 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశాడు. గత మ్యాచ్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ మీద 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడటంలో ఎక్స్పర్ట్ అయిన రుతురాజ్.. క్రీజులో కుదురుకున్నాడా మ్యాచ్‌ను ముగించేంత వరకు ఊరుకోడు. అడ్డగోలుగా షాట్స్ బాదకుండా.. బాల్ మెరిట్‌ను బట్టి ఆడటం అతడికి అలవాటు.
ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఎంత కీలకమో.. సీఎస్కేకు రుతురాజ్ అంతే కీలకమని చెప్పాలి. సాధ్యమైనన్ని ఓవర్లు క్రీజులో ఉండి టీమ్‌కు బిగ్ స్కోర్ అందించేందుకు అతడు ప్రయత్నిస్తుంటాడు. మ్యాచ్ సిచ్యువేషన్స్‌ను బట్టి అవసరమైతే హిట్టింగ్‌కు దిగడానికీ అతడు వెనుకాడడు. ముఖ్యంగా పేసర్లను అటాక్ చేయడంలో అతడు సిద్ధహస్తుడు. ఇన్నింగ్స్ మొదట్లోనే రుతురాజ్‌ను వెనక్కి పంపించాలి. ఒకవేళ అతడు గానీ సెటిల్ అయ్యాడా ఆపడం కష్టమే. సీఎస్కేను ఓడించాలంటే రుతురాజ్ అడ్డంకిని బెంగళూరు దాటాలి. అతడ్ని ఆపితే భారీ స్కోరు చేయకుండా నిలువరించొచ్చు. రుతురాజ్ ఫెయిలైతే ప్రెజర్ ఇతర బ్యాటర్ల మీద పడుతుంది. రాంగ్ షాట్స్ ఆడే క్రమంలో ఎక్కువ వికెట్లు పడే అవకాశం ఉంది. అందుకే అతడి మీదే ఆర్సీబీ ఎక్కువగా ఫోకస్ చేయనుంది. మరి.. రుతురాజ్ అడ్డంకిని దాటి బెంగళూరు గెలుస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.