Nidhan
ఐపీఎల్-2024లో వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆర్సీబీ.. పాయింట్స్ టేబుల్లో చివర్లో ఉండకపోతే అదే గొప్పని అనుకున్నారు. కానీ పట్టుదలతో ఆడుతూ వచ్చిన ఆ టీమ్ ఇప్పుడు దర్జాగా ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది.
ఐపీఎల్-2024లో వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆర్సీబీ.. పాయింట్స్ టేబుల్లో చివర్లో ఉండకపోతే అదే గొప్పని అనుకున్నారు. కానీ పట్టుదలతో ఆడుతూ వచ్చిన ఆ టీమ్ ఇప్పుడు దర్జాగా ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది.
Nidhan
ఐపీఎల్-2024 ఫస్టాఫ్‌లో వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయింది ఆర్సీబీ. ఆడిన మొదటి ఎనిమిది మ్యాచుల్లో ఏడింట ఓడి దారుణమైన విమర్శల్ని మూటగట్టుకుంది. ఆ టీమ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఇక చేసేదేమీ లేదని, అంతా ముగిసిందనుకొని బ్యాగులు సర్దుకున్నాడట. కానీ ఇక్కడే అద్భుతం చోటుచేసుకుంది. ఒక దశలో పాయింట్స్ టేబుల్లో చివర్లో ఉండకపోతే గొప్పని అనుకున్న ఆర్సీబీ.. పట్టుదలతో ఆడుతూ ఇప్పుడు ఏకంగా ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. సీఎస్కే వంటి టాప్ టీమ్‌ను నాకౌట్ పోరులో చిత్తు చేసి ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది డుప్లెసిస్ సేన. అయితే వరుస ఓటముల నుంచి అనూహ్యంగా క్వాలిఫై అవడం వరకు బెంగళూరు సక్సెస్ వెనుక ఓ అదృశ్య శక్తి పనిచేసింది.
ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ఎంత బాగా ఆడినా ఆర్సీబీ ఓడిపోతుండటంతో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ కూడా డల్ అయ్యాడు. ఆఖర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్న దినేష్ కార్తీక్ కూడా తమ జట్టు రాత ఇంతే అని నిరాశలో కూరుకుపోయాడు. ఈ టీమ్ ఫేట్ మార్చడం తన వల్ల కాదని కెప్టెన్ డుప్లెసిస్ కుంగిపోయాడు. ఈ టైమ్‌లో ఓ అదృశ్య శక్తి ఎంట్రీ ఇచ్చింది. ఆ సీక్రెట్ పవరే బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్. మీ వల్ల అవుతుంది అంటూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేశాడు ఆండీ. 1 శాతం అవకాశాన్ని కూడా 100 శాతం వరకు తీసుకెళ్లొచ్చంటూ వాళ్లలో మనోధైర్యం నింపాడు. మీరు ప్రపంచాన్నే జయించగలరు.. ఇదో లెక్కా అంటూ వాళ్లలోని పౌరుషాన్ని బయటకు తీశాడు. అంతే ఆర్సీబీ ప్లేయర్లు చెలరేగిపోయారు.
కోచ్ ఆండీ ఫ్లవర్ చెప్పినట్లు ప్రతి మ్యాచ్‌ను డూ ఆర్ డైగా తీసుకున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. దూకుడే మంత్రంగా చెలరేగిపోయారు. ఎదురొచ్చిన ప్రతి జట్టును తొక్కిపడేస్తూ ముందుకెళ్లారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఏదైనా సరే, అటాకింగ్ మోడ్‌లోనే ఆడుతూ అపోజిషన్ టీమ్స్‌ను భయపెట్టడం స్టార్ట్ చేశారు. నిన్న సీఎస్కేను కూడా ఇలాగే ఆడి వణికించారు. ఉన్న వనరుల్ని సరిగ్గా వినియోగించుకుంటూ అద్భుతాలు సృష్టించడం ఎలాగో బాగా తెలిసిన కోచ్ ఆండీ.. జట్టు కూర్పును బాగా సెట్ చేశాడు. సరిగ్గా పెర్ఫార్మ్ చేయని మ్యాక్స్‌వెల్, సిరాజ్ లాంటి వారికి రెస్ట్ ఇచ్చి స్వప్నిల్, కర్ణ్ శర్మ, విల్ జాక్స్‌ను టీమ్‌లోకి దించాడు. వాళ్లు గ్రాండ్ సక్సెస్ అయ్యారు.
కొంత గ్యాప్ తర్వాత సిరాజ్‌ను జట్టులోకి తీసుకుంటే అతడూ అదరగొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ బ్యాట్‌తో, బంతితో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఎవర్ని ఎప్పుడు ఆడించాలి, వాళ్లలోని బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఎలా బయటకు తీయాలో తెలిసిన ఆండీ ఫ్లవర్ టీమ్ అవసరాలకు తగ్గట్లు అందర్నీ వాడుకున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీకే కాదు.. పీఎస్ఎల్, సీపీఎల్, హండ్రెడ్ లీగ్, ఐఎల్టీ20 లీగ్స్‌లో ఇతర జట్లకూ కోచింగ్ ఇస్తూ ఎంతో అనుభవం గడించాడాయన. దాన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ బెంగళూరు సక్సెస్‌కు కారణం అవుతున్నాడు. మరి.. ఆండీ ఫ్లవర్ కోచింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Andy Flower as head coach in T20 Leagues:
Finalist in CPL 2020
Eliminator in PSL 2020
Won PSL 2021
Eliminator in Hundred 2021
Finalist in CPL 2021
Finalist in PSL 2022
Eliminator in IPL 2022
Won Hundred 2022
Won ILT20 2023
Finalist in PSL 2023
Play-offs in IPL 2023
Play-offs in… pic.twitter.com/IShNT2GXaR— Johns. (@CricCrazyJohns) May 18, 2024