iDreamPost
android-app
ios-app

అందరూ RCBని అంటున్నారు.. కానీ దరిద్రంలో పంజాబ్​ను మించనది లేదు!

  • Published Apr 22, 2024 | 5:51 PM Updated Updated Apr 22, 2024 | 5:51 PM

ఐపీఎల్​లో మోస్ట్ అన్​లక్కీ టీమ్​గా ఆర్సీబీకి పేరుంది. అయితే దరిద్రంలో బెంగళూరును మించిన ఇంకో జట్టు ఉంది. అదే పంజాబ్ కింగ్స్.

ఐపీఎల్​లో మోస్ట్ అన్​లక్కీ టీమ్​గా ఆర్సీబీకి పేరుంది. అయితే దరిద్రంలో బెంగళూరును మించిన ఇంకో జట్టు ఉంది. అదే పంజాబ్ కింగ్స్.

  • Published Apr 22, 2024 | 5:51 PMUpdated Apr 22, 2024 | 5:51 PM
అందరూ RCBని అంటున్నారు.. కానీ దరిద్రంలో పంజాబ్​ను మించనది లేదు!

ఐపీఎల్​లో మోస్ట్ అన్​లక్కీ టీమ్​గా ఆర్సీబీకి పేరుంది. దరిద్రంలో ఆ జట్టును మించినది లేదని అంటుంటారు. రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. క్యాష్​ రిచ్ లీగ్ మొదలై 16 ఏళ్లు అవుతున్నా ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు బెంగళూరు. సూపర్ స్టార్లతో నిండిన టీమ్ ప్రతిసారి ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్​తో రావడం తుస్సుమనడం అలవాటుగా మారింది. కీలక మ్యాచుల్లో చేతులెత్తేయడం, గెలవాల్సిన చోట స్మాల్ మార్జిన్​తో ఓడటం, అదృష్టం కూడా ఆ టీమ్​కు హ్యాండ్ ఇవ్వడం కామన్​గా మారిపోయింది. ఈసారి కూడా ఆర్సీబీది అదే తీరు. ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లో ఏడింట ఓడిన డుప్లెసిస్ సేన అఫీషియల్​గా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే దరిద్రంలో బెంగళూరును మించిపోతోంది ఓ జట్టు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దరిద్రంలో ఆర్సీబీ కంటే తానే తోపు అని ప్రూవ్ చేస్తోంది పంజాబ్ కింగ్స్. ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పు కొట్టని టీమ్స్​లో పంజాబ్ కూడా ఒకటి. చివరగా ఐపీఎల్-2014లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందా జట్టు. ఆ ఏడాది ఫైనల్​కు వెళ్లిన టీమ్ టైటిల్ ఫైట్​లో ఓడిపోయింది. 2014లో రన్నరప్​గా నిలిచిన పంజాబ్.. ఆ తర్వాత నుంచి దారుణంగా ఆడుతోంది. గత 9 సీజన్లలో ఆ జట్టు ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్​కు క్వాలిఫై కాకపోవడం గమనార్హం. ఆ లెక్కన చూసుకుంటే ఫ్లాప్​గా టీమ్​గా ఆర్సీబీని కాదు.. పంజాబ్​నే పిలవాలి. సీజన్ల మీద సీజన్లు గడుస్తున్నా పంజాబ్ ఆటతీరు ఎంత మాత్రం మారలేదు. చెత్తాటతో ఆ టీమ్ ఫ్యాన్ బేస్ కూడా పడిపోతోంది. ఇతర వెన్యూలను పక్కనబెడితే.. సొంత మైదానంలో ఆడే మ్యాచుల్లోనూ పంజాబ్ కంటే అపోజిషన్ టీమ్స్​కే ఎక్కువ సపోర్టర్స్ కనిపిస్తున్నారు.

దరిద్రంలో ఆర్సీబీని పంజాబ్ మించిపోయిందని అనడానికి ఈ సీజనే గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. ఈ సీజన్​లో ఆ జట్టు ఓడిన మ్యాచుల్లో దాదాపుగా అన్నీ ఫైనల్ మ్యాచ్​లో ముగిసినవే. సన్​రైజర్స్ హైదరాబాద్ మీద 2 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్.. రాజస్థాన్ రాయల్స్ చేతుల్లోనూ ఆఖర్లో రెండు బంతులు ఉన్నప్పుడు మ్యాచ్​ను చేజార్చుకుంది. ముంబై ఇండియన్స్ మీద కూడా విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. నిన్న గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​ను కూడా లాస్ట్ ఓవర్​కు తీసుకెళ్లగలిగింది. కానీ జీటీని గెలవకుండా నిలువరించలేకపోయింది. కీలక సమయాల్లో మెయిన్ ప్లేయర్లు ఫెయిలవడం, లక్ కలసి రాకపోవడం.. ఇలా ఏదో ఒక రూపంలో ఆ టీమ్​ గెలుపును అడ్డుకుంటున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే పాయింట్స్ టేబుల్​లో ఆర్సీబీతో కలసి టేబుల్ లాస్ట్​లో ఉంది పంజాబ్. ఈ రెండు టీమ్స్ కప్పు కల ఎప్పుడు తీరుతుందో మరి!