Nidhan
నాకౌట్ ఫైట్‌లో సీఎస్కేకు షాకిచ్చి ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది ఆర్సీబీ. అయితే గెలుపు అనంతరం బెంగళూరు అభిమానులు ప్రవర్తించిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి.
నాకౌట్ ఫైట్‌లో సీఎస్కేకు షాకిచ్చి ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది ఆర్సీబీ. అయితే గెలుపు అనంతరం బెంగళూరు అభిమానులు ప్రవర్తించిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి.
Nidhan
ఐపీఎల్-2024లో ఆశల్లేని స్థితి నుంచి దర్జాగా ప్లేఆఫ్స్ గడప తొక్కే వరకు అద్భుతంగా సాగింది ఆర్సీబీ జర్నీ. ఫస్టాఫ్‌లో వరుస పరాజయాలతో డీలా పడిపోయింది డుప్లెసిస్. 8 మ్యాచుల్లో ఏడింట్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి టెక్నికల్‌గా వైదొలిగింది. దీంతో ఆ టీమ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. ఇక తట్టా బుట్టా సర్దుకొని అస్సాంకే అని ఫిక్స్ అయ్యారు. అయితే అనూహ్యంగా పుంజుకున్న కోహ్లీ టీమ్ ఒక్కో మ్యాచ్‌ను టార్గెట్‌గా పెట్టుకొని గెలుస్తూ పోయింది. నాకౌట్ మ్యాచ్‌లో సీఎస్కేను ఓడించి ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మ్యాచ్ తర్వాత బెంగళూరు అభిమానులు ప్రవర్తించిన తీరు కాస్తా వివాదాస్పదంగా మారింది. ఇదేం తీరు.. ఇంత వరస్ట్ బిహేవియర్ ఏంటంటూ ట్రోలింగ్‌కు గురయ్యారు ఆర్సీబీ ఫ్యాన్స్.
ఆర్సీబీ-సీఎస్కే నాకౌట్ ఫైట్ ముగిసిన తర్వాత స్టేడియం బయట ఉన్న చెన్నై అభిమానులను ఏడిపించారు బెంగళూరు ఫ్యాన్స్. మీ టీమ్ ఓడిందంటూ వాళ్లను ఎగతాళి చేశారు. ఆర్సీబీ జెండాలను వాళ్లపై కప్పి అవమానించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో బెంగళూరు ఫ్యాన్స్‌ది చెత్త ప్రవర్తన అంటూ సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వచ్చాయి. గెలిచామని చెప్పి ఇంత ఓవరాక్షన్ చేయడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వచ్చాయి. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్సీబీ అభిమానులు.. ఇన్నాళ్లూ తాము పడిన అవమానాల మాటేంటి అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆర్సీబీ-సీఎస్కే మ్యాచులు జరిగిన సమయంలో బెంగళూరు ఓడినప్పుడు చెన్నై అభిమానులు తమను ఎగతాళి చేయడం, అవమానించడం, ట్రోల్ చేయడాన్ని గుర్తుచేస్తున్నారు.
ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు, మీ వల్ల కాదు అంటూ ఎన్నోసార్లు అవమానించారని, అసహనానికి గురిచేశారని ఆర్సీబీ ఫ్యాన్స్ అంటున్నారు. రోడ్ల మీదే తమను గేలి చేశారని, లూజర్స్ అంటూ తమను ఏడిపించారంటూ కొన్ని వీడియోలను ఉదాహరణగా చూపిస్తున్నారు. కర్మ అంటే ఇదేనని, అదెవ్వర్నీ వదలదని కామెంట్స్ చేస్తున్నారు. చెన్నై గెలిచినప్పుడు తమతో ఆడుకున్నారని.. అందుకే ఇప్పుడు ఇలా జరిగిందని, కర్మ ఎవర్నీ వదలదని చెబుతున్నారు. ఈ సీజన్లోనూ ఓ లేడీ ఫ్యాన్ చేతికి ఖాళీ కప్పు ఇచ్చి.. ఈ సాలా కప్ నమ్దే అంటూ తమను ఎగతాళి చేశారని అంటున్నారు. మరి.. ఆర్సీబీ-సీఎస్కే ఫ్యాన్స్ కాంట్రవర్సీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
They disrespected, mocked us for years but now crying like hell when karma hit hard on them? Karma is real pic.twitter.com/RApwcDsgC8
— leisha (@katyxkohli17) May 21, 2024