వీడియో: ప్రామిస్ చేసి మాట తప్పారు.. RCBపై చాహల్ సీరియస్!

స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీపై సీరియస్ అయ్యాడు. ఆ ఫ్రాంచైజీ తనకు ప్రామిస్ చేసి మాట తప్పిందన్నాడు. ఇంకా చాహల్ ఏమన్నాడంటే..!

స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీపై సీరియస్ అయ్యాడు. ఆ ఫ్రాంచైజీ తనకు ప్రామిస్ చేసి మాట తప్పిందన్నాడు. ఇంకా చాహల్ ఏమన్నాడంటే..!

లాయల్టీ అనే పదానికి ఫ్రాంచైజీ క్రికెట్​లో స్థానం ఉండదు. ఇక్కడ ప్లేయర్లు, టీమ్స్, కోచింగ్ స్టాఫ్​.. ఇలా ఎవరైనా సరే వాళ్ల అవసరానికి తగ్గట్లు వ్యవహరిస్తుంటారు. మంచి అవకాశం వస్తే ఆటగాళ్లు జట్లు మారడం చూస్తూనే ఉంటాం. ఇవాళ శత్రువులుగా ఉన్న ప్లేయర్లు, నెక్స్ట్ సీజన్​లో ఒకే టీమ్​కు కలసి ఆడటం కూడా కామన్. అయితే కొందరు క్రికెటర్లు మాత్రం ఫ్రాంచైజీలకు ఎమోషనల్​గా కనెక్ట్ అవుతారు. అందుకే జట్టును వీడేందుకు ఇష్టపడరు. అలాంటి వాళ్లను టీమ్​లో నుంచి తీసేస్తే పడే బాధను వర్ణించడం కష్టమే. అది కూడా మాట ఇచ్చి తప్పితే అస్సలు తట్టుకోలేరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తనతో ఇలాగే వ్యవహరించిందని స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రివీల్ చేశాడు. ప్రామిస్ చేసి ఆర్సీబీ మాట తప్పిందంటూ అతడు సీరియస్ అయ్యాడు.

‘నేను ఇంత డబ్బులు కావాలని అడగలేదు. నా ఆటకు ఎంత ఇస్తే సరిపోతుందో నాకు తెలుసు. అందుకే నేను డిమాండ్ చేయలేదు. మేనేజ్​మెంట్ నుంచి నాకు ఓ ఫోన్ కాల్ కూడా రాలేదు. ఎవరూ నాకు సమాచారం ఇవ్వలేదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడాల్సింది. ఆర్సీబీ టీమ్ తరఫున నేను 114 మ్యాచ్​లు ఆడా. నన్ను ఎందుకు ఆక్షన్​లో పెట్టారో అర్థం కాలేదు. అయితే ఆ సమయంలో ఫ్రాంచైజీ నాకు ప్రామిస్ చేసింది. ఎలాగైనా తిరిగి టీమ్​లోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ వాళ్లు మాట నిలబెట్టుకోలేదు’ అని చాహల్ చెప్పుకొచ్చాడు. లాయల్టీకి విలువ లేదంటూ సీరియస్ అయ్యాడు సీనియర్ స్పిన్నర్. అయితే ఈ వీడియో పాతది. కానీ బెంగళూరు వరుస ఓటములు, రాజస్థాన్ రాయల్స్ తరఫున చాహల్ సూపర్బ్​గా బౌలింగ్ చేస్తుండటంతో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాహల్ వీడియో చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆర్సీబీ అనవసరంగా మంచి బౌలర్​ను వదులుకుందని అంటున్నారు. లాయల్​గా ఉన్న ప్లేయర్లను వదులుకోవడం కరెక్ట్ కాదని.. చాహల్ విషయంలో బెంగళూరు మేనేజ్​మెంట్ వ్యవహరించిన తీరు సరికాదని ఫైర్ అవుతున్నారు. మంచి ఆటగాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలని.. అది టీమ్​కు కూడా ప్లస్ అవుతుందని చెబుతున్నారు. కాగా, 2014 నుంచి 2021 వరకు వరుసగా 8 సంవత్సరాలు ఆర్సీబీకి ఆడాడు చాహల్. 2022లో అతడ్ని వదులుకోవడంతో ఆక్షన్​లో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. రూ.6.50 కోట్లు చెల్లించి స్టార్ స్పిన్నర్​ను సొంతం చేసుకుంది రాజస్థాన్. ఈ సీజన్​లో ఆ టీమ్ వరుస విజయాలు సాధించడంలో చాహల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటిదాకా 3 మ్యాచుల్లో 6 వికెట్లు తీశాడతను. మరి.. ఆర్సీబీ మాట తప్పిందంటూ చాహల్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments