Nidhan
టీమ్‌లో అతడు వద్దంటే వద్దని ఆర్సీబీ ఫ్యాన్స్ గోల గోల చేశారు. అలాంటోడు జట్టులో ఉంటే ఇక కప్పు కొట్టినట్టేనని అన్నారు. కానీ ఆ ప్లేయరే ఇప్పుడు మ్యాచ్ విన్నర్ అయ్యాడు. ఆర్సీబీకి నయా హీరోగా మారాడు.
టీమ్‌లో అతడు వద్దంటే వద్దని ఆర్సీబీ ఫ్యాన్స్ గోల గోల చేశారు. అలాంటోడు జట్టులో ఉంటే ఇక కప్పు కొట్టినట్టేనని అన్నారు. కానీ ఆ ప్లేయరే ఇప్పుడు మ్యాచ్ విన్నర్ అయ్యాడు. ఆర్సీబీకి నయా హీరోగా మారాడు.
Nidhan
ఆ జట్టునే ముంచేశాడు, అతడు మనకెందుకు? అన్నారు. టీమ్‌లో అతడు వద్దంటే వద్దని ఆర్సీబీ ఫ్యాన్స్ గోల గోల చేశారు. అలాంటోడు జట్టులో ఉంటే ఇక కప్పు కొట్టినట్టేనని అన్నారు. కానీ ఆ ప్లేయరే ఇప్పుడు మ్యాచ్ విన్నర్ అయ్యాడు. ఆర్సీబీకి నయా హీరోగా మారాడు. ఐపీఎల్-2024లో ఇప్పుడు అందరూ బెంగళూరు గురించే మాట్లాడుకుంటున్నారు. సీజన్ మొదట్లో వరుస పరాజయాలతో విమర్శల పాలైంది డుప్లెసిస్ సేన. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవడం పక్కనపెడితే.. పరువు దక్కితే అదే పది వేలని అనుకున్నారు. కానీ వరుసగా 5 విజయాలతో గన్ నుంచి ఫైర్ అయిన బుల్లెట్లా దూసుకెళ్తోంది ఆర్సీబీ. ఆ టీమ్ సక్సెస్‌లో కీలకంగా మారాడో ప్లేయర్. అతడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్సీబీకి నయా హీరోగా అవతరించాడు లెఫ్టార్మ్ పేసర్ యష్ దయాల్. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడతను. తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ మంచి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఓ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్ చేతిలో అతడు బలయ్యాడు. యష్ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సులు బాదాడు రింకూ. దీంతో అతడ్ని జీటీ రిలీజ్ చేసింది. ఈ దెబ్బతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడీ పేసర్. ఒత్తిడి, ఫెయిల్ అయ్యాననే బాధతో కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఆ పెయిన్ నుంచి రికవర్ అయ్యాక తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు. దీంతో ఈ సీజన్‌కు ముందు జరిగిన మినీ ఆక్షన్‌లో దయాల్‌ను కొనుక్కుంది ఆర్సీబీ.
రింకూ చేతిలో బలైన యష్ ఆర్సీబీలోకి రాగానే ఆ టీమ్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. అతడో చెత్త బౌలర్ అని, ఒకే ఓవర్లో 5 సిక్సులు ఇచ్చిన ప్లేయర్‌ను తీసుకోవడాన్ని మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదన్నారు. అతడు టీమ్‌లో ఉండటానికి వీల్లేదని చెప్పారు. కానీ ఇప్పుడు అతడే మ్యాచ్ విన్నర్‌గా మారాడు. ఇప్పటిదాకా ఆడిన 12 మ్యాచుల్లో కలిపి 13 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ 8గా ఉంది. దీన్ని బట్టే అతడు పొదుపుగా పరుగులు ఇస్తూ, వికెట్లు పడగొడుతూ టీమ్ విజయాల్లో ఎంత కీలకంగా మారాడో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనూ అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేశాడు. ఇన్నాళ్లూ విలన్‌గా భావించినోడు ఇప్పుడు ఆర్సీబీకి హీరోగా మారాడు. అతడు ఇలాగే అదరగొడితే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. యష్ దయాల్ బౌలింగ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Yash Dayal and Lockie Ferguson have been the standout bowlers for RCB against Delhi. pic.twitter.com/h5pVXgZQGA
— CricTracker (@Cricketracker) May 12, 2024