Nidhan
ఐపీఎల్లో వివాదాస్పదంగా మారిన ఓ రూల్ గురించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బీసీసీఐని అనవసరంగా తిడుతున్నారని.. ఆ రూల్‌లో ఉన్న తప్పేంటని ఆయన ప్రశ్నించాడు.
ఐపీఎల్లో వివాదాస్పదంగా మారిన ఓ రూల్ గురించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బీసీసీఐని అనవసరంగా తిడుతున్నారని.. ఆ రూల్‌లో ఉన్న తప్పేంటని ఆయన ప్రశ్నించాడు.
Nidhan
ఐపీఎల్-2024 అద్భుతంగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్‌తో ప్లేఆఫ్స్ మీద మరింత ఆసక్తి కలుగుతోంది. ఏ జట్టు క్వాలిఫై అవుతుంది? ఏది లీగ్ దశ నుంచే బయటకు వెళ్తుందో తెలుసుకునేందుకు అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఒక్కో మ్యాచ్‌తో ప్లేఆఫ్స్ సమీకరణాలు మారుతుండటంతో ఫ్యాన్స్ మ్యాచుల్ని ఆసక్తిగా చూస్తున్నారు. ప్లేఆఫ్స్ మీద ఒకవైపు ఫ్యాన్స్, ఆడియెన్స్ డిస్కషన్స్ చేస్తుంటే.. మరోవైపు ఐపీఎల్‌లోని ఓ రూల్ మీద ఆటగాళ్లు, ఎక్స్పర్ట్స్ చర్చలు చేస్తున్నారు. ఈ రూల్ వద్దంటే వద్దని రోహిత్ శర్మ, రిషబ్ పంత్ సహా పలువురు ప్లేయర్లు నిక్కచ్చిగా చెబుతున్నారు. ఈ తరుణంలో ఈ వివాదంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి బాగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నిబంధన ప్రకారం బ్యాటింగ్ లేదా బౌలింగ్ టైమ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి అదనంగా ఒక ఆటగాడ్ని తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అయితే లాస్ట్ సీజన్లో అమల్లోకి వచ్చిన ఈ రూల్ క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిబంధన వల్ల ముఖ్యంగా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతోందనే కామెంట్స్ వస్తున్నాయి. టీమ్‌లో బ్యాటర్ల సంఖ్య పెరగడంతో ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేస్తున్నారని అంటున్నారు. దీని వల్ల క్రికెట్ మజా మిస్ అవుతోందని చెబుతున్నారు. రోహిత్, పంత్ కూడా ఈ రూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై రవిశాస్త్రి స్పందించాడు. ఈ నిబంధనను అతడు సమర్థించాడు.
ఇంపాక్ట్ రూల్‌లో ఉన్న తప్పేంటో చెప్పాలని రవిశాస్త్రి అన్నాడు. బీసీసీఐని అనవసరంగా విమర్శించడం కరెక్ట్ కాదన్నాడు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మంచిది. సిచ్యువేషన్‌ను బట్టి టీమ్ పెర్ఫార్మెన్స్ను మరింత బెటర్ చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది. ఇతర గేమ్స్‌లోనూ ఇలాంటి రూల్స్ ఉన్నాయి. ఈ నిబంధన వల్లే ఈ ఐపీఎల్ సీజన్లో పలు మ్యాచ్‌లు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగాయి. దీన్ని బట్టి లీగ్‌లో ఇది భారీ మార్పు తీసుకొచ్చిందనే అర్థం. కొత్త రూల్స్ వచ్చినప్పుడు అది సరికాదని చాలా మంది అంటారు. కానీ కొన్నాళ్లు గడిస్తే కానీ దాని లాభం ఏంటో అర్థం కాదు. ఈ సీజన్లో 200 ప్లస్ స్కోర్లను చూస్తే ఈ రూల్ వల్ల ఛాన్స్ పొందిన ప్లేయర్లు ఎలా ఆడారో తెలుసుకోవచ్చు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి.. ఇంపాక్ట్ రూల్‌పై రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.