iDreamPost
android-app
ios-app

పాయింట్స్ టేబుల్​లో లాస్ట్​లో ఉన్న పంజాబ్ ఆ విషయంలో అందరికంటే టాప్​లో..!

  • Published May 12, 2024 | 4:31 PMUpdated May 12, 2024 | 4:31 PM

ఐపీఎల్-2024లో చెత్త ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్​లో లాస్ట్​ ప్లేస్​కు పడిపోయింది పంజాబ్. అయితే ఓ విషయంలో మాత్రం అన్ని జట్ల కంటే టాప్​లో ఉంది.

ఐపీఎల్-2024లో చెత్త ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్​లో లాస్ట్​ ప్లేస్​కు పడిపోయింది పంజాబ్. అయితే ఓ విషయంలో మాత్రం అన్ని జట్ల కంటే టాప్​లో ఉంది.

  • Published May 12, 2024 | 4:31 PMUpdated May 12, 2024 | 4:31 PM
పాయింట్స్ టేబుల్​లో లాస్ట్​లో ఉన్న పంజాబ్ ఆ విషయంలో అందరికంటే టాప్​లో..!

పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా కప్పు కొట్టని జట్లలో ఒకటి. మొదట్లో కొన్ని సీజన్ల పాటు ఆ జట్టు బాగా పెర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. ప్లేఆఫ్స్​కు వెళ్తూ తన ఫ్యాన్ బేస్​ను బాగా పెంచుకుంది. కానీ గత కొన్ని సీజన్లుగా పంజాబ్ ఆట పూర్తిగా పడిపోయింది. ఆ జట్టు దారుణంగా ఆడుతోంది. ఈ సీజన్​లోనైనా ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమోనని అనుకుంటే మళ్లీ నిరాశ తప్పలేదు. చాలా మటుకు మ్యాచుల్లో గెలుపు అంచు వరకు వచ్చి ఆగిపోవడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. ఈ సీజన్​లో ఆడిన 12 మ్యాచుల్లో 4 విజయాలు, 8 పరాజయాలతో పాయింట్స్ టేబుల్​లో ఆఖరి పొజిషన్​లో నిలిచింది. కానీ ఒక విషయంలో మాత్రం టాప్ టీమ్స్​ను కూడా దాటేసింది.

పాయింట్స్ టేబుల్​లో చివరి స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు తన ఆఖరి రెండు మ్యాచుల్లోనూ నెగ్గినా లాభం లేదు. అభిమానులకు ఊరటను ఇవ్వడానికి తప్పితే వాళ్ల గెలుపుతో ఎవరికీ ఒరిగేదేమీ లేదు. గెలవాల్సిన మ్యాచుల్లోనూ ఓడి ఫ్యాన్స్​ను తీవ్రంగా నిరాశపర్చిన పంజాబ్.. ఒక విషయంలో మాత్రం అందరి కంటే ముందంజలో ఉంది. అదే ఫెయిర్​ ప్లే. ఈ అవార్డు రేసులో పంజాబ్ 123 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్​లో ఉంది. ఆ తర్వాత పొజిషన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ (123 పాయింట్లు) ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (121), రాజస్థాన్ రాయల్స్ (108) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్​లో టాప్​లో ఉన్న కోల్​కతా నైట్ రైడర్స్.. ఫెయిర్​ ప్లేలో మాత్రం 106 పాయింట్లతో లాస్ట్​ ప్లేస్​లో నిలిచింది. దీంతో ఈసారి ఫెయిర్​ ప్లే అవార్డును పంజాబ్ కొట్టేయడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అయితే సెకండ్ ప్లేస్​లో ఉన్న ఎస్​ఆర్​హెచ్​ ఇంకా ఎక్కువ మ్యాచ్​లు ఆడే ఛాన్స్ ఉన్నందున ఆ టీమ్​ కూడా విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కాగా, ఐపీఎల్​లో ఆయా జట్లు ఎంత నిబద్ధతతో ఆడాయి అనేది గుర్తిస్తూ ఫెయిర్ ​ప్లే పురస్కారం ఇస్తూ వస్తున్నారు. ఆట మీద ఉన్న నిబద్ధత, ప్రత్యర్థి జట్లపై చూపించే గౌరవం, గేమ్ రూల్స్​కు ఇచ్చే రెస్పెక్ట్, అంపైర్లతో వ్యవహరించే తీరును ప్రాతిపదికగా తీసుకొని టీమ్స్​కు పాయింట్లు ఇస్తుంటారు. మరి.. ఈ సీజన్​లో ఏ జట్టు ఫెయిర్​ ప్లే అవార్డు గెలుచుకుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి