Nidhan
సీఎస్కే మాజీ సారథి ఎంఎస్ ధోని ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ ఫస్టాఫ్‌లో మెయిన్ హైలైట్స్‌లో మాహీ బ్యాటింగ్ ఒకటని చెప్పాలి. అయితే ఇంత బాగా ఆడుతున్న ధోని లేటుగా బ్యాటింగ్‌కు వస్తున్నాడు.
సీఎస్కే మాజీ సారథి ఎంఎస్ ధోని ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ ఫస్టాఫ్‌లో మెయిన్ హైలైట్స్‌లో మాహీ బ్యాటింగ్ ఒకటని చెప్పాలి. అయితే ఇంత బాగా ఆడుతున్న ధోని లేటుగా బ్యాటింగ్‌కు వస్తున్నాడు.
Nidhan
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ ఫస్టాఫ్‌లో మెయిన్ హైలైట్స్‌లో మాహీ బ్యాటింగ్ ఒకటని చెప్పాలి. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో కలిపి 87 పరుగులు చేశాడు ధోని. ఏంటి 87 పరుగులేనా అనుకోకండి. ఆఖరి రెండు, మూడు ఓవర్లు ఉన్నప్పుడే అతడు క్రీజులోకి వస్తున్నాడు. ఆడిన కొన్ని బంతుల్లోనే ఎడా పెడా బౌండరీలు, సిక్సులు బాది స్కోరు బోర్డును బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టిస్తున్నాడు. అతడు 87 పరుగులు చేసేందుకు 34 బంతులే తీసుకున్నాడు. స్ట్రయిక్ రేట్ 255.8గా ఉండటం విశేషం. ఇంక ఇన్నింగ్స్ ఫైనల్ ఓవర్లో అతడి దూకుడుకు అడ్డే లేకుండా పోతోంది. ఈ సీజన్లో ఫైనల్ ఓవర్స్‌లో 16 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు మాహీ. అయితే ఇంత భీకర ఫామ్‌లో ఉన్నా అతడు లాస్ట్లోనే బ్యాటింగ్‌కు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు ధోని. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ బాదిపారేస్తున్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా 3 బంతుల్లో 3 భారీ సిక్సులు కొట్టాడు. అయితే ఇంత బాగా ఆడుతున్న మాహీ లేటుగా బ్యాటింగ్‌కు వస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో డౌన్లో దిగుతున్నాడు. అతడు ఎక్కువ బంతులు ఆడితే మరింత ఎక్కువ పరుగులు స్కోరు బోర్డు మీదకు చేరే అవకాశం ఉంది. అలాగే అతడి బ్యాటింగ్ మెరుపుల్ని మరింత ఎంజాయ్ చేసే ఛాన్స్ అభిమానులకు కలుగుతుంది. ధోని ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే సీఎస్కే విన్నింగ్ ఛాన్సులు అంత పెరుగుతాయి. అయినా అతడు లేటుగా వస్తుండటంతో అతడికి బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ విషయం మీద చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రియాక్ట్ అయ్యాడు.
ధోని ఇంకా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని.. అందుకే అతడు లేటుగా బ్యాటింగ్‌కు వస్తున్నాడని ఫ్లెమింగ్ అన్నాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ ముగిశాక మాహీ తన కాలుకు సర్జరీ చేయించుకున్నాడని.. ఇంకా ఆ నొప్పితోనే అతడు బాధపడుతున్నాడని చెప్పాడు. ఫుల్‌గా రికవర్ కాలేదని, అందుకే కొన్ని బంతుల్ని మాత్రమే ఫేస్ చేసేందుకు లోయరార్డర్లో బ్యాటింగ్‌కు దిగుతున్నాడని ఫ్లెమింగ్ తెలిపాడు. తన గేమ్ చూసేందుకు స్టేడియానికి వచ్చే వేలాది మంది అభిమానుల కోసమే ధోని బ్యాటింగ్‌కు వస్తున్నాడని. వాళ్లను నిరుత్సాహపరచొద్దనే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూనే ఆడుతున్నాడని పేర్కొన్నాడు ఫ్లెమింగ్. ఈ టోర్నీలో మాహీ టీమ్‌లో ఉండటం తమకు ఎంతో అవసరమని చెప్పుకొచ్చాడు. మరి.. ఫ్యాన్స్ కోసం నొప్పిని భరిస్తూనే ధోని ఆడటంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Stephen Fleming ” Ms Dhoni had a problem with his knee,and is still recovering,which is why there is only a certain amount of balls against which he can function well.And we need him for the tournament and in the 2-3 over cameos,he is owning that space.”pic.twitter.com/3sXQznvQ5l
— Sujeet Suman (@sujeetsuman1991) April 20, 2024