IPL 2024 Mumbai Indians 250 Matches Record: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. IPL హిస్టరీలోనే తొలి జట్టుగా..!

చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. IPL హిస్టరీలోనే తొలి జట్టుగా..!

రాజస్థాన్ రాయల్స్​తో మ్యాచ్​తో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్​ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డును అందుకుంది.

రాజస్థాన్ రాయల్స్​తో మ్యాచ్​తో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్​ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డును అందుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో హ్యూజ్ ఫ్యాన్​బేస్ కలిగిన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి టీమ్స్​తో సమానంగా అభిమాన గణం ఈ టీమ్​కు ఉన్నారు. సచిన్ దగ్గర నుంచి రోహిత్ శర్మ వరకు ఎందరో టాప్ ప్లేయర్స్ ఈ టీమ్​ ప్రాతినిధ్యం వహించడం దీనికి ఓ కారణం. 5 సార్లు క్యాష్ రిచ్ లీగ్ ట్రోఫీని అందుకోవడం వల్ల కూడా ఆ జట్టుకు ఫ్యాన్​బేస్ భారీగా పెరిగింది. ప్రతిసారి టోర్నీలో ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగుతూ తమ ఆటతీరుతో అభిమానులతో పాటు ఆడియెన్స్​ను కూడా ఎంతో వినోదాన్ని పంచుతుంటారు ముంబై ఆటగాళ్లు. అలాంటి ఎంఐ ఫ్రాంచైజీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఏ జట్టుకూ సాధ్యం కానిది ముంబై అందుకుంది. ఏంటా రికార్డు అనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్​లో 250 మ్యాచులు ఆడిన ఫస్ట్ టీమ్​గా ముంబై ఇండియన్స్ రికార్డు క్రియేట్ చేసింది. రాజస్థాన్​ రాయల్స్​తో సోమవారం జరిగిన మ్యాచ్​తో ఈ మైల్​స్టోన్​ను అందుకుంది హార్దిక్ సేన. ఈ జాబితాలో ముంబై తర్వాతి స్థానాల్లో వరుసగా ఆర్సీబీ (244), ఢిల్లీ క్యాపిటల్స్ (241), కోల్​కతా నైట్ రైడర్స్ (239), పంజాబ్ కింగ్స్ (235), సీఎస్​కే (228) ఉన్నాయి. దీంతో ముంబై ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. 250 మ్యాచ్​ల మైల్​స్టోన్​ను తమ జట్టు అందరికంటే ముందు అందుకుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రికార్డు సంగతి పక్కనబెడితే.. ఈసారి ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిన హార్దిక్ సేన.. ఇంకా బోణీ చేయలేదు.

రాజస్థాన్​ రాయల్స్​తో నిన్న జరిగిన మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసి ముంబై ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 34 పరుగులతో టాప్ స్కోరర్​గా ఉన్నాడు. దీన్ని బట్టే ఆ టీమ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలోనే టార్గెట్​ను ఉఫ్​మని ఊదిపారేసింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరోసారి తన బ్యాట్​తో రఫ్ఫాడించాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్​ను ఫినిష్​ చేశాడు. ఈ మ్యాచ్​లో ఓటమితో ముంబైపై విమర్శలు పెరిగాయి. ఇలా ఆడితే ఈసారి కప్పు కాదు కదా.. ప్లేఆఫ్స్​కు కూడా వెళ్లలేరని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

ఇదీ చదవండి: IPL హిస్టరీలో చెత్త రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ!

Show comments