iDreamPost

IPL హిస్టరీలో చెత్త రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ

RR vs MI- Rohit Sharma: రాజస్థాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ దారుణంగా నిరాశ పరిచాడు. గోల్డెన్ డక్ కావడం మాత్రమే కాకుండా.. తన పేరిట ఒక చెత్త రికార్డును క్రియేట్ చేశాడు.

RR vs MI- Rohit Sharma: రాజస్థాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ దారుణంగా నిరాశ పరిచాడు. గోల్డెన్ డక్ కావడం మాత్రమే కాకుండా.. తన పేరిట ఒక చెత్త రికార్డును క్రియేట్ చేశాడు.

IPL హిస్టరీలో చెత్త రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్- ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వాఖండే వేదికగా ముంబయి ఫ్యాన్స్ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఎందుకంటే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు మొదటి ఓవర్ నుంచి ముంబయిపై ఆధిపత్యం చలాయిస్తూనే ఉంది. రాజస్థాన్ బౌలర్స్ వేసే బంతులకు ముంబయి బ్యాటర్ల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ముఖ్యంగా బౌల్ట్ వేసిన స్పెల్ కు ముంబయి బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఐపీఎల్ లోనే చెత్త రికార్డును తన ఖాతాలో కూడా వేసుకున్నాడు.

వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ముంబయి బ్యాటర్లు గాడిలో పడేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిసారి రాజస్థాన్ బౌలర్లు ఒక విటెక్ తీస్తున్నారు. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ విజృంభించాడు. వేసిన 3 ఓవర్లలోనే కేవలం 14 పరుగులు ఇచ్చి.. ఏకంగా 3 వికెట్లు తీసుకున్నాడు. రోహిత్ శర్మ(0), నమన్ ధిర్(0), బ్రెవిస్(0) ఇలా ముంబయి టాపార్డర్ ని పెవిలియన్ కి పంపాడు. అంతేకాకుండా ముగ్గురు బ్యాటర్లను ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ చేయడం గమనార్హం. అయితే వాంఖడేలో ఈ మ్యాచ్ లో రోహిత్ నుంచి పరుగుల వరద కోరుకున్న ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డక్ గా వెనుదిరిగారు. ఈ మ్యాచ్ లో ముంబయి ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత ట్రెంట్ బౌల్ట్ తే అవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ లో అత్యధికసార్లు డకౌట్ గా నిలిచిన ఆటగాడిగా దినేశ్ కార్తిక్(17 సార్లు) ఉన్న చెత్త రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఈ మ్యాచ్ లో గోల్డెన్ డక్ అవ్వడంతో దినేశ్ కార్తిక్ రికార్డును సమం చేశాడు. రోహిత్ శర్మ గోల్డెన్ డక్ కావడమే నిరాశను కలిగించిన విషయం అయితే.. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఈ చెత్త రికార్డును రోహిత్ ఫ్యాన్స్ ని మరింత నిరాశకు గురి చేసింది.

ఈ మ్యాచ్ తో కలిపి 17 సార్లు డకౌట్ అయ్యి రోహిత్ శర్మ, ధినేశ్ కార్తిక్ మొదటి స్థానంలో ఉన్నారు. వారి తర్వాత గ్లెన్ మ్యాక్స్ వెల్, పియూష్ చావ్లా, మన్దీప్ సింగ్, సునీల్ నరైన్ 15 సార్లు డకౌట్ అయ్యారు. ఇంక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబయి బ్యాటింగ్ ఇషాన్ కిషన్(16), రోహిత్ శర్మ(0), నమన్ ధిర్(0), బ్రెవిస్(0), తిలక్ వర్మ(21*), హార్దిక్ పాండ్యా(20*) బ్యాటింగ్ చేస్తున్నారు. 7 ఓవర్లకు 59 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయారు. హార్దిక్- తిలక్ వర్మ కలిసి ముంబయి జట్టుని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి.. రోహిత్ శర్మ ఐపీఎల్లో చెత్త రికార్డు నెలకొల్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి