iDreamPost
android-app
ios-app

Rohit-Kohli: వీడియో: రోహిత్-కోహ్లీ ఫెవికాల్ బాండ్.. ఇది భయ్యా ఫ్రెండ్​షిప్ అంటే!

  • Published Apr 12, 2024 | 2:52 PM Updated Updated Apr 12, 2024 | 2:52 PM

క్రికెట్ ఫీల్డ్​లో శత్రుత్వమే కాదు.. మిత్రుత్వం కూడా ఉంటుంది. కొందరు ఆటగాళ్ల మధ్య స్నేహబంధాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాంటి దోస్తులే రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ.

క్రికెట్ ఫీల్డ్​లో శత్రుత్వమే కాదు.. మిత్రుత్వం కూడా ఉంటుంది. కొందరు ఆటగాళ్ల మధ్య స్నేహబంధాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాంటి దోస్తులే రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ.

  • Published Apr 12, 2024 | 2:52 PMUpdated Apr 12, 2024 | 2:52 PM
Rohit-Kohli: వీడియో: రోహిత్-కోహ్లీ ఫెవికాల్ బాండ్.. ఇది భయ్యా ఫ్రెండ్​షిప్ అంటే!

క్రికెట్ ఫీల్డ్​లో శత్రుత్వమే కాదు.. మిత్రుత్వం కూడా ఉంటుంది. కొందరు ఆటగాళ్ల మధ్య స్నేహబంధాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాంటి దోస్తులే రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ. వీళ్లు తమ కెరీర్ స్టార్టింగ్ నుంచి కలిసే టీమిండియాకు ఆడుతున్నారు. ముందుగా హిట్​మ్యాన్ ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ లెక్కన కింగ్​కు అతడు సీనియర్ అనే చెప్పాలి. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు వచ్చిన విరాట్ మాత్రం రోహిత్​తో బాగా కలసిపోయాడు. ఇద్దరూ కలసి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్​లతో ఎన్నో మ్యాచుల్లో భారత్​కు విజయాలు అందించారు. అయితే కోహ్లీ కెప్టెన్సీ వివాదం తర్వాత రోహిత్​తో అతడికి పడట్లేదనే పుకార్లు స్టార్ట్ అయ్యాయి. భారత సారథ్య పగ్గాలు చేపట్టిన హిట్​మ్యాన్​తో కింగ్ అంటీముట్టనట్లుగా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. కానీ వీళ్లు ఎప్పుడూ అలా కనిపించలేదు సరికదా మరింత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు.

గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ రోహిత్-కోహ్లీ మధ్య స్నేహబంధం ఎంత బలంగా ఉందో బయటపడింది. వికెట్ పడితే వాళ్లు కలసి సెలబ్రేట్ చేసుకోవడం, కీలకమైన నిర్ణయాలను ఇద్దరూ చర్చించి తీసుకోవడం కనిపించింది. ఇప్పుడు మరోసారి తమ మధ్య ఫ్రెండ్​షిప్ బాండ్​ను బయటపెట్టారు రోకో జోడీ. ముంబై ఇండియన్స్-ఆర్సీబీ మధ్య వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్​లో ఎంఐ ఇన్నింగ్స్​ టైమ్​లో నాన్​స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న రోహిత్ దగ్గరకు వెళ్లాడు కోహ్లీ. వెనక నుంచి వెళ్లి అతడ్ని సరదాగా గిల్లాడు. దీంతో ఎవరా అని చూసిన రోహిత్.. విరాట్ కనిపించగానే ఓకే అంటూ బొటనవేలితో సైగ చేశాడు. అభిమాన క్రికెటర్ల మధ్య జరిగిన ఈ సీన్​ను చూసి ఆడియెన్స్ మురిసిపోయారు. రోకో ఫ్రెండ్​షిప్ ఫెవికాల్​లా విడదీయలేనిదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, ఈ మ్యాచ్​లో ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఫ్యాన్స్ మళ్లీ ఏడిపించారు. బూ అంటూ అతడ్ని ఎగతాళి చేశారు. అయితే ఇది చూసిన కోహ్లీ సీరియస్ అయ్యాడు. టీమిండియా తరఫున ఆడే ఆటగాడ్ని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని.. దయచేసి ఆపేయాలంటూ అభిమానులకు సైగ్ చేశాడు. దీంతో వాళ్లు శాంతించారు. ఇది గమనించిన పాండ్యా.. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్​ను కలిశాడు. అతడ్ని హగ్ చేసుకున్నాడు. హార్దిక్ కూడా అతడ్ని బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ఇద్దరి మధ్య బాండింగ్ చూస్తుంటే సొంత అన్నాదమ్ముల్లాగే కనిపించారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒకే మ్యాచ్​లో రోహిత్, ఆ తర్వాత హార్దిక్​తో ప్రవర్తించిన తీరుతో అందరి హృదయాలు గెలుచుకున్నాడు కింగ్. ఫ్రెండ్​షిప్​కు అతడు ఇచ్చే విలువ ఇదని అందరూ అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pola Adiripola (@pola_adiripolaaaaa)