iDreamPost
android-app
ios-app

లక్నో కెప్టెన్​గా నికోలస్ పూరన్.. KL రాహుల్​పై వేటుకు కారణం?

  • Published Mar 30, 2024 | 10:04 PM Updated Updated Mar 30, 2024 | 10:04 PM

పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో లక్నో సూపర్ జియాంట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్​పై వేటు వేసింది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో లక్నో సూపర్ జియాంట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్​పై వేటు వేసింది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 30, 2024 | 10:04 PMUpdated Mar 30, 2024 | 10:04 PM
లక్నో కెప్టెన్​గా నికోలస్ పూరన్.. KL రాహుల్​పై వేటుకు కారణం?

ఐపీఎల్-2024ను ఓటమితో మొదలుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్​.. రెండో మ్యాచ్​లో బోణీ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు అనూహ్య నిర్ణయంతో షాక్ ఇచ్చింది ఎల్​ఎస్​జీ. కెప్టెన్ కేఎల్ రాహుల్​ను సారథ్య పగ్గాల నుంచి తప్పించింది. అతడి ప్లేస్​లో మరో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్​ను కొత్త కెప్టెన్​గా ప్రకటించింది. దీంతో అసలు ఏం జరుగుతోందో ఎల్​ఎస్​జీ అభిమానులకు అర్థం కాలేదు. టాస్ టైమ్​లో పూరన్ వచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్​లో రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్​గా బరిలోకి దిగాడు. దీంతో ఆ జట్టు అభిమానులు షాకయ్యారు. రాహుల్​పై వేటుకు కారణం ఏంటని ఆలోచనల్లో పడ్డారు.

కెప్టెన్​గా ఉన్నోడ్ని ఇంపాక్ట్​ ప్లేయర్​గా దించడం ఏంటని రాహుల్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఇటీవల ఇంగ్లండ్​తో సిరీస్​లో కేఎల్​కు గాయం తిరగబెట్టింది. దీంతో ఆ సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఇంజ్యురీ నుంచి కోలుకున్న అతడికి ఇంకొన్నాళ్ల పాటు రెస్ట్ అవసరం. దీంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని లక్నో మేనేజ్​మెంట్ డిసైడ్ అయింది. కానీ టీమ్​లో ఉంటానని రాహుల్ పట్టుబట్టడంతో అతడ్ని కేవలం బ్యాటింగ్​కు మాత్రమే పరిమితం చేయాలని యాజమాన్యం భావించిందని నికోలస్ పూరన్ తెలిపాడు. అందుకే అతడ్ని ఇంపాక్ట్ ప్లేయర్​గా తీసుకున్నామని చెప్పాడు. మరి.. రాహుల్​ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఇంపాక్ట్ ప్లేయర్​గా ఆడించడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.