Rohit Sharma Autograph To Romario Shepherd: రోహిత్ గొప్పతనం ఏంటో చెప్పే సీన్ ఇది.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు!

LSG vs MI: రోహిత్ గొప్పతనం ఏంటో చెప్పే సీన్ ఇది.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఛాన్స్ వస్తే అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడతారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఛాన్స్ వస్తే అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడతారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. దశాబ్దంన్నరగా అద్భుతమైన బ్యాటింగ్​తో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టి సక్సెస్ అయ్యాడు. బ్యాటర్​గా, కెప్టెన్​గా వరల్డ్ క్రికెట్​లో తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్​లోనూ ముంబై ఇండియన్స్​కు కెప్టెన్​గా ఉంటూ 5 కప్పులు అందించాడు. టన్నుల కొద్దీ పరుగులు, ఎన్నో అరుదైన ఘనతలు తన పేరు మీద రాసుకున్నాడు. అందుకే అతడికి భారీగా అభిమానగణం ఏర్పడింది. రోహిత్​ను లైఫ్​లో ఒక్కసారి చూస్తే చాలని అనుకునే వాళ్లకూ లెక్కలేదు. ఛాన్స్ వస్తే హిట్​మ్యాన్​తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడతారు.

ఫ్యాన్స్​తో రోహిత్ ఇట్టే కలసిపోతాడు. అందుకే గ్రౌండ్​లో ప్రత్యర్థులను బ్యాటింగ్​తో బెదరగొట్టేటోడు బయట ఇంత జోవియల్​గా ఉన్నాడేంటని షాక్ అవుతుంటారు. రోహిత్ సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోతుంటారు. అలాంటి ఫ్యాన్స్​ అతడి గొప్పతనం ఏంటో తెలిస్తే కాలర్ ఎగరేయాల్సిందే. స్టార్ క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్​లు తీసుకునేందుకు అభిమానులు ఎగబడటం కామనే. కానీ ఇక్కడ మాత్రం రోహిత్ ఆటోగ్రాఫ్​ కోసం మరో స్టార్ క్రికెటర్ వెంటపడ్డాడు. వెస్టిండీస్ డేంజరస్ ప్లేయర్ రొమారియో షెఫర్డ్ హిట్​మ్యాన్​ను కలిశాడు. ముంబై-లక్నో మ్యాచ్ జరుగుతున్న టైమ్​లో రోహిత్​ను కలసి ఆటోగ్రాఫ్​ తీసుకున్నాడు షెఫర్డ్. ఇది చూసిన ఫ్యాన్స్ స్టార్ క్రికెటర్లకు కూడా రోహిత్ ఆరాధ్య దైవం అని అంటున్నారు. రియల్ క్రేజ్ అంటే ఇదేనని చెబుతున్నారు. మరి.. రోహిత్ ఆటోగ్రాఫ్ కోసం విండీస్ స్టార్ వెంటపడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments