రాహుల్​ను తిడితే ఫీలయ్యారు.. ఆ టీమ్ ఓనర్ నన్ను ఏకంగా కొట్టాడు: రాస్ టేలర్

ఐపీఎల్-2024లో కేఎల్ రాహుల్​తో లక్నో ఓనర్ వ్యవహరించిన తీరు ఎంతో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కివీస్ లెజెండ్ రాస్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తననో ఫ్రాంచైజీ ఓనర్ కొట్టాడని అన్నాడు.

ఐపీఎల్-2024లో కేఎల్ రాహుల్​తో లక్నో ఓనర్ వ్యవహరించిన తీరు ఎంతో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కివీస్ లెజెండ్ రాస్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తననో ఫ్రాంచైజీ ఓనర్ కొట్టాడని అన్నాడు.

ఐపీఎల్ అంటే ధనాధన్ క్రికెట్​కు, ఫుల్ ఎంటర్​టైన్​మెంట్​కు అడ్డా అనే అనుకుంటాం. క్యాష్ రిచ్ లీగ్ ద్వారా బోలెడ్ వినోదం అందడం కరెక్టే. కానీ ఈ లీగ్​ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ దగ్గర నుంచి ఆటగాళ్ల మధ్య ఘర్షణల వరకు ఐపీఎల్​లో చాలా కాంట్రవర్సీలు నడిచాయి. ఈ ఏడాది కూడా ఓ విషయం బాగా చర్చల్లో నిలిచింది. లక్నో సూపర్​జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్​ను అందరి ముందే గ్రౌండ్​లో తిట్టాడు ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా. జట్టు ఓటమిని తట్టుకోలేని గోయెంకా.. రాహుల్​ను అందరి ముందే తిట్టిపోశాడు. రాహుల్ ఎంత సర్దిచెప్పినా అతడు వినలేదు. ఈ వివాదంలో గోయెంకా మీద భారీగా విమర్శలు వచ్చాయి.

టీమ్ కెప్టెన్​ అయిన రాహుల్​తో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ గోయెంకాను సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఓ ఇంటర్నేషనల్ ప్లేయర్​తో, అందునా భారత జట్టుకు అపూర్వ సేవలు అందించిన ఆటగాడ్ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదంటూ అందరూ లక్నో యజమాని మీద ఫైర్ అయ్యారు. ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో న్యూజిలాండ్ లెజెండ్ రాస్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాహుల్​ను తిడితేనే అందరూ ఇంతలా ఫీల్ అవుతున్నారని.. తనను అప్పట్లో ఓ ఐపీఎల్ టీమ్ ఓనర్ ఏకంగా కొట్టాడని బయటపెట్టాడు టేలర్. ఐపీఎల్-2011లో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పాడు. ఇంతకీ టేలర్​ మీద చేయి చేసుకున్న ఆ ఓనర్ మరెవరో కాదు.. రాజస్థాన్ రాయల్స్ మాజీ కో ఓనర్ అయిన రాజ్ కుంద్రా.

‘కేఎల్ రాహుల్​ను అతడి టీమ్ ఓనర్ తిట్టాడు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిని సహించడానికి వీల్లేదు. అయితే రాహుల్​ను తిట్టారు.. నన్ను ఏకంగా కొట్టారు. రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ నా మీద అప్పట్లో చేయి చేసుకున్నాడు. రాస్.. నీకు మిలియన్ డాలర్లు ఇచ్చేది డకౌట్ అవ్వడం కోసం కాదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఒకసారి, రెండుసార్లు కాదు.. నాలుగైదు సార్లు నా ముఖం మీద కొట్టాడు. కొట్టడమే గాక నా వైపు ఎగతాళిగా చూస్తూ నవ్వాడు’ అని రాస్ టేలర్ చెప్పుకొచ్చాడు. కివీస్ లెజెండ్ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఇలాంటి వాటిని అస్సలు ఉపేక్షించొద్దని.. సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే బాగా ఆడాలంటూ ప్రోత్సహించాలని అంటున్నారు. ఇలా తిట్టడం, కొట్టడం ప్రొఫెషనలిజం అనిపించుకోదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments