iDreamPost
android-app
ios-app

వీడియో: సీరియస్​గా ఉండే నరైన్​ను నవ్వించిన కోహ్లీ.. జోక్ వింటే మీరూ నవ్వేస్తారు!

  • Published Apr 21, 2024 | 5:42 PM Updated Updated Apr 21, 2024 | 5:42 PM

కేకేఆర్ స్టార్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ ఎప్పుడూ సీరియస్​గా ఉంటాడు. వికెట్ తీసినా, సిక్స్ కొట్టినా అతడి ముఖంలో ఎక్స్​ప్రెషన్ మారదు. అలాంటోడ్ని నవ్వించాడు విరాట్ కోహ్లీ.

కేకేఆర్ స్టార్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ ఎప్పుడూ సీరియస్​గా ఉంటాడు. వికెట్ తీసినా, సిక్స్ కొట్టినా అతడి ముఖంలో ఎక్స్​ప్రెషన్ మారదు. అలాంటోడ్ని నవ్వించాడు విరాట్ కోహ్లీ.

  • Published Apr 21, 2024 | 5:42 PMUpdated Apr 21, 2024 | 5:42 PM
వీడియో: సీరియస్​గా ఉండే నరైన్​ను నవ్వించిన కోహ్లీ.. జోక్ వింటే మీరూ నవ్వేస్తారు!

కేకేఆర్ స్టార్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ ఎప్పుడూ సీరియస్​గా ఉంటాడు. వికెట్ తీసినా, సిక్స్ కొట్టినా అతడి ముఖంలో ఎక్స్​ప్రెషన్ మారదు. ఆఖరికి సెంచరీ కొట్టినా నరైన్ ఫేస్​లో స్మైల్ మాత్రం కనిపించదు. చాలా అరుదుగా నవ్వే నరైన్​ను నవ్వించేందుకు సహచర ప్లేయర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. కానీ ఇంకో టీమ్ ఆటగాడు మాత్రం అతడ్ని నవ్వించాడు. ఇది కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్​లో చోటుచేసుకుంది. ఈ రెండు టీమ్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో నరైన్ పొట్టచెక్కలయ్యేలా నవ్వాడు.

కేకేఆర్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన టైమ్​లో విరాట్ కోహ్లీ వేసిన జోక్​కు నరైన్ నవ్వాపుకోలేకపోయాడు. అప్పటికి ఫస్ట్ ఓవర్ ఇంకా మొదలు కాలేదు. చేతిలో బంతితో బౌలింగ్ ఎండ్​కు వెళ్లాడు విరాట్. తల మీద క్యాప్ తీసి అంపైర్​కు ఇచ్చాడు. బౌలింగ్​ స్టార్ట్ చేయడానికి ముందు బౌలర్లు చేసినట్లుగా రెండు చేతుల్ని తిప్పుతూ వార్మప్ చేశాడు. దీంతో ఏంటి.. కోహ్లీ ఫస్ట్ ఓవర్ వేయబోతున్నాడా? ఈ సీజన్​లో ఒక్క ఓవర్ కూడా వేయని విరాట్.. నేరుగా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేయడం ఏంటని అంతా షాకయ్యారు. కానీ అది కింగ్ వేసిన జోక్ అని తర్వాత తెలిసింది.

అందర్నీ నవ్విద్దామనే ఉద్దేశంతో కోహ్లీ బౌలింగ్ చేయనున్నట్లు యాక్షన్​తో బోల్తా కొట్టించాడు. ఇది చూసి నరైన్ కూడా నవ్వుల్లో మునిగిపోయాడు. ఆ తర్వాత కోహ్లీ-నరైన్ ఏదో మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ సీరియస్​గా ఉండే నరైన్​నే నవ్వించావు.. నువ్వు తోపు బాస్ అంటూ విరాట్​ను మెచ్చుకుంటున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 48)తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 50) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో రమణ్​దీప్ సింగ్ (9 బంతుల్లో 24 నాటౌట్) కూడా భారీ షాట్లు బాదుతూ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు.