Nidhan
హైస్కోరింగ్ ఫైట్‌లో ఆర్సీబీని ఓడించింది కేకేఆర్. ఈ గెలుపులో శ్రేయస్ అయ్యర్ కీలకపాత్ర పోషించాడు. బ్యాట్‌తో రాణించిన అతడు.. బౌలింగ్ టైమ్‌లోనూ ఓ ట్రిక్‌ను వాడాడు. అది భలేగా వర్కౌట్ అయింది.
హైస్కోరింగ్ ఫైట్‌లో ఆర్సీబీని ఓడించింది కేకేఆర్. ఈ గెలుపులో శ్రేయస్ అయ్యర్ కీలకపాత్ర పోషించాడు. బ్యాట్‌తో రాణించిన అతడు.. బౌలింగ్ టైమ్‌లోనూ ఓ ట్రిక్‌ను వాడాడు. అది భలేగా వర్కౌట్ అయింది.
Nidhan
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన సండే ఫైట్‌లో ఆ టీమ్ 1 పరుగు తేడాతో ఓడిపోయింది. హైస్కోరింగ్ మ్యాచ్‌లో విజయం కోసం ఆఖరి వరకు పోరాడినా లాభం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లకు 222 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో డుప్లెసిస్ సేన అన్ని ఓవర్లు ఆడి 221 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అంపైర్ల తప్పులు ఆ జట్టు పాలిట శాపంగా మారాయి. అదే సమయంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వేసిన ఓ ట్రిక్ కూడా ఆర్సీబీని గెలవకుండా ఆపింది.
బెంగళూరు విజయానికి చివరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్రీజులో ఉన్న కర్ణ్ శర్మపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవ్. భీకర వేగంతో బంతులు వేసే ఎక్స్‌పీరియెన్స్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను తట్టుకొని అతడు పరుగులు చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఫస్ట్ బాల్నే అతడు సిక్సర్ కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్ని కూడా స్టాండ్స్‌లోకి పంపాడతను. అయితే ఐదో బంతికి కర్ణ్ శర్మ ఔట్ అయ్యాడు. స్టార్క్ సూపర్బ్ రిటర్న్ క్యాచ్‌తో కేకేఆర్‌కు బ్రేక్ త్రూ అందించాడు. ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన దశలో శ్రేయస్ అయ్యర్ ఒక్క ట్రిక్‌తో మ్యాచ్‌ను మార్చేశాడు. లాస్ట్ బాల్‌కు బ్యాట్ తగిలినా, తగలకపోయినా రెండు పరుగులు తీసేందుకు ఆర్సీబీ బ్యాటర్లు ప్రయత్నిస్తారని గ్రహించిన అయ్యర్.. ఆ బాల్‌కు ముందు ఫీల్డర్లు అందరికీ కీలక సూచన చేశాడు.
ఫైనల్ బాల్‌కు ముందు ఫీల్డర్లు అందరికీ ఓ మెసేజ్ పంపాడు అయ్యర్. బాల్ ఎవరి దగ్గరికి వచ్చినా సరే దాన్ని కీపింగ్ ఎండ్‌కే త్రో చేయాలని చెప్పాడు. ఏదేమైనా బంతిని కీపర్‌కు మాత్రమే విసరాలని ఆదేశించాడు. స్టార్క్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసిన బాల్‌ను డీప్ కవర్స్‌లోకి తరలించాడు బ్యాటర్ లాకీ ఫెర్గూసన్. ఆ ఏరియాకు దగ్గర్లో ఉన్న ఫీల్డర్ రమణ్‌దీప్ సింగ్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్‌ను పిక్ చేసి కీపర్ ఫిల్ సాల్ట్ వైపు త్రో చేశాడు. బాల్‌ను అందుకున్న సాల్ట్ గాల్లో డైవ్ చేసి మరీ వికెట్లను గిరాటేశాడు. దీంతో అయ్యర్ ఊహించిన మాదిరిగానే కీపర్ ఎండ్ వైపు రనౌట్ అయి మ్యాచ్ కేకేఆర్ వశమైంది.
సాధారణంగా ఫీల్డర్లు ఏ ఎండ్లోనైనా త్రో వేయొచ్చు. కానీ బౌలింగ్ వేశాక బౌలర్ వచ్చి వికెట్ల దగ్గర నిలబడేసరికి లేట్ అవుతుంది. అదే కీపర్ అయితే స్టంప్స్ దగ్గర కాచుకొని ఉండొచ్చు. రనౌట్లు చేయడంలో వారికి ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. అదే టైమ్‌లో షాట్ కొట్టాక రెండో రన్ తీయడం బ్యాటర్‌కు కష్టం. అందుకే కీపింగ్ ఎండ్ వైపు త్రో విసరాలని అందర్నీ అలర్ట్ చేశాడు అయ్యర్. ఈ ట్రిక్ వర్కౌట్ అయింది. ఒకవేళ దీన్ని గనుక ఆర్సీబీ ఆటగాళ్లు ముందే గ్రహించి ప్లాన్ చేసుకొని ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌కు దారితీసేది. కానీ అది జరగకుండా అయ్యర్ ఆపాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే మ్యాచ్ తర్వాత రివీల్ చేశాడు. మరి.. అయ్యర్ ట్రిక్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ONE OF THE BEST FINISH IN IPL 2024…!!! 💥
– Phil Salt with a dive to win it for KKR. 👏 pic.twitter.com/m6VDnYqcN9
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2024
Shreyas Iyer said “Before the final ball, I have asked all the fielders that finish the throw at the keepers end, no matter what happens”. pic.twitter.com/J9ohvriXks
— Johns. (@CricCrazyJohns) April 22, 2024