iDreamPost

Phil Salt: వీడియో: RCB బౌలర్లతో ఆటాడుకున్న సాల్ట్.. ఉతుకుడే ఉతుకుడు!

  • Published Apr 21, 2024 | 5:02 PMUpdated Apr 21, 2024 | 5:02 PM

కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన విశ్వరూపం చూపించాడు. ఆర్సీబీ బౌలర్లతో ఆ పించ్ హిట్టర్ ఓ రేంజ్​లో ఆటాడుకున్నాడు.

వరుస పరాజయాలతో డీలాపడ్డ ఆర్సీబీ.. కోల్​కతా నైట్ రైడర్స్​ మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే బౌలింగ్ బలహీనతతో ఇబ్బంది పడుతున్న ఆ జట్టుకు కేకేఆర్ మీద కూడా అదే మైనస్ అయింది. ఈ రెండు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్​ జరుగుతోంది. ఈ మ్యాచ్​లో కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ రెచ్చిపోయాడు. ఆర్సీబీ బౌలర్లతో ఓ రేంజ్​లో ఆడుకున్నాడీ పించ్ హిట్టర్. ఫస్ట్ బాల్ నుంచి ఉతుకుడే ఉతుకుడు అన్నట్లు అతడి బ్యాటింగ్ సాగింది.

14 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు సాల్ట్. అతడి ఇన్నింగ్స్​లో 3 భారీ సిక్సులతో పాటు 7 బౌండరీలు ఉన్నాయి. చక్కటి టైమింగ్​తో షాట్లు కొట్టిన సాల్ట్.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్​లో రెచ్చిపోయాడు. అతడి ఓవర్​లో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. సునీల్ నరైన్ (10)తో కలసి ఫస్ట్ వికెట్​కు 56 పరుగులు జోడించిన తర్వాత మహ్మద్ సిరాజ్ బౌలింగ్​లో రజత్ పాటిదార్​కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు సాల్ట్. అతడికి ఇంకో ఎండ్ నుంచి సపోర్ట్ లభించి ఉంటే కేకేఆర్ మరింత బిగ్ స్కోరు చేసేది. ఆ టీమ్ ప్రస్తుతం 13 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 137 పరుగులతో ఉంది. బెంగళూరు బౌలర్ల వికెట్లు తీసినా గానీ భారీగా రన్స్ లీక్ చేస్తున్నారు. మరి.. సాల్ట్ ఇన్నింగ్స్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి