iDreamPost

ట్రావిస్- అభిషేక్ వల్లే మాకీ దుస్థితి.. భువనేశ్వర్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

Bhuvneshwar Kumar On Travis Head And Abhishek Sharma: ఐపీఎల్ 2024లో మరో అద్భుతమైన మ్యాచ్ రికార్డుల కెక్కింది. హైదరాబాద్ జట్టు విజృంభించడంతో ఢిల్లీ జట్టుకు ఘోర పరాజయం తప్పలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శనను మాత్రం అంతా మెచ్చుకోవాల్సిందే.

Bhuvneshwar Kumar On Travis Head And Abhishek Sharma: ఐపీఎల్ 2024లో మరో అద్భుతమైన మ్యాచ్ రికార్డుల కెక్కింది. హైదరాబాద్ జట్టు విజృంభించడంతో ఢిల్లీ జట్టుకు ఘోర పరాజయం తప్పలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శనను మాత్రం అంతా మెచ్చుకోవాల్సిందే.

ట్రావిస్- అభిషేక్ వల్లే మాకీ దుస్థితి.. భువనేశ్వర్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

IPL 2024లో అసలైన్ ధనా ధన్ లీగ్ మజాని ఎంజాయ్ చేస్తున్నారా? ఒక్కో మ్యాచ్ ఆ థ్రిల్ ని రెట్టింపు చేస్తోంది. ముఖ్యంగా షెడ్యూల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఉందంటే ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతున్నారు. అలాగే రికార్డులు కూడా ఎన్ని బ్రేక్ అవుతాయో.. అని ఎక్స్ పర్ట్స్ లెక్కలు రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ బ్యాటింగ్ యూనిట్ ని ఏ బౌలర్ కూడా కదిలించే పరిస్థితి లేదు. మొదటి ఓవర్ నుంచే విజృంభించడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఫామ్ చూస్తే వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా వణికిపోతున్నారు. బాల్ ఎక్కడ వేయాలో తెలియక వైడ్లు వేయడం చూశాం. టీమ్ మొత్తాన్ని అవుట్ చేయడం ఒకెత్తు అయితే వీళ్లిద్దరినీ అవుట్ చేయడం ఒకెత్తు అయిపోతోంది. వీళ్ల వల్లే మాకు కష్టాలు అంటూ సొంత బౌలర్ భువనేశ్వర్ కామెంట్ చేయడం వైరల్ అవుతోంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో అద్భుతమ ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్ మెరుపులు చూస్తే ఫ్యాన్స్ కి ముచ్చటేస్తోంది. అయితే ఎంత భారీ స్కోర్ కొట్టినా కూడా భారీ విజయాలు నమోదు చేయడంలో మాత్రం హైదరాబాద్ జట్టు ఇంకా విఫలమవుతోంది. అంటే 287 పరుగులు చేసినప్పుడు ఫ్యాన్స్ కనీసం 70, 80 పరుగుల తేడాతో విజయం దక్కాలని భావిస్తారు. కానీ, 30, 34 పరుగుల తేడాతో గెలవడం కాస్త నిరాశకు గురి చేస్తోంది. అందుకు బౌలింగ్ యూనిట్ కాస్త పటిష్టంగా లేకపోవడమే కారణంగా చెప్పచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం బౌలర్లు కూడా పుంజుకున్నారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థులకు పిచ్చెక్కించారు. అయితే ఇలా బౌలర్లు కాస్త విఫలం కావడానికి కారణం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అంటున్నారు. అది కూడా ఈ మాట అన్నది మరెవరో కాదు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. అవును మీరు చదివింది నిజమే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మా వల్లే హైదరాబాద్ బౌలర్లు రాణించడం లేదు అంటూ కామెంట్స్ చేశాడు. వాళ్ల వల్లే బౌలర్లు సరైన ప్రదర్శన చేయడం లేదు అంటున్నాడు.

అయితే భువనేశ్వర్ కుమార్ ఫన్నీగా చేసిన వ్యాఖ్యలు ఇవి. మ్యాచ్ తర్వాత క్వశ్చన్స్ కి సమాధానం చెప్తూ భువనేశ్వర్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా టీమ్ 150, 180 పరుగులు చేస్తే బౌలర్లపై ఒత్తిడి ఉంటుంది. కాస్త బాధ్యతగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ తరహాలో విజృంభించి 250+ పరుగులు చేస్తూ పోతుంటే.. బౌలర్లు రిలాక్స్ అవుతున్నారు. వారిపై అంత ఒత్తిడి ఉడటం లేదు. అందుకే కాస్త రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారు. దీనంతటికి కారణం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. మరి.. భువనేశ్వర్ కామెంట్స్ లో నిజం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి