iDreamPost
android-app
ios-app

వీడియో: KKRలో కోచ్, కెప్టెన్ కంటే ఎక్కువగా గంభీర్ డామినేషన్.. ఇదే ప్రూఫ్!

  • Published May 06, 2024 | 2:40 PM Updated Updated May 06, 2024 | 2:40 PM

ఐపీఎల్-2024లో కోల్​కతా నైడ్ రైడర్స్ జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ టీమ్​ను ఢీకొట్టడం ఎవ్వరివల్లా కావడం లేదు. గత సీజన్లలో కంటే కేకేఆర్ ఈసారి చాలా భిన్నంగా కనిపిస్తోంది.

ఐపీఎల్-2024లో కోల్​కతా నైడ్ రైడర్స్ జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ టీమ్​ను ఢీకొట్టడం ఎవ్వరివల్లా కావడం లేదు. గత సీజన్లలో కంటే కేకేఆర్ ఈసారి చాలా భిన్నంగా కనిపిస్తోంది.

  • Published May 06, 2024 | 2:40 PMUpdated May 06, 2024 | 2:40 PM
వీడియో: KKRలో కోచ్, కెప్టెన్ కంటే ఎక్కువగా గంభీర్ డామినేషన్.. ఇదే ప్రూఫ్!

ఐపీఎల్​లో బిగ్ టీమ్స్​లో కోల్​కతా నైట్ రైడర్స్ ఒకటి. రెండు సార్లు ఛాంపియన్స్​గా నిలిచిన కేకేఆర్.. మరో రెండు మార్లు రన్నరప్​గా నిలిచింది. నాలుగు మార్లు ప్లేఆఫ్స్​ వరకు వెళ్లగలిగింది. ఈ జట్టు తరఫున ఎందరో అనామకులు స్టార్లుగా ఎదిగారు. ఐపీఎల్​లో ఇంతటి ఘన చరిత్ర కలిగిన కోల్​కతా.. గత రెండు సీజన్లలో తుస్సుమంది. లీగ్ దశకే పరిమితమైంది. అయితే ఈసారి మాత్రం స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలతో పాయింట్స్ టేబుల్​లో టాప్​లో నిలిచింది. ఆ టీమ్ ప్లేఆఫ్స్​ బెర్త్ దాదాపుగా ఖాయమే. అయితే సీజన్ గ్యాప్​లో కేకేఆర్ పెర్ఫార్మెన్స్​లో ఇంత మార్పు రావడం వెనుక ముగ్గురు వ్యక్తుల కృషి ఉంది. వాళ్లే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ చంద్రకాంత్ పండిట్, మెంటార్ గౌతం గంభీర్.

గాయం కారణంగా గత సీజన్​కు దూరమైన అయ్యర్ ఈ సీజన్​లో కేకేఆర్ పగ్గాలు చేపట్టాడు. మెంటార్ గంభీర్ రాకతో కోచ్ చంద్రకాంత్ పండిట్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టి జట్టును విజయాల బాటలో తీసుకొచ్చారు. కోల్​కతా ఆటగాళ్లలో ధైర్యం, గెలవాలని కసి, తపనను నూరిపోసిన గంభీర్.. వాళ్లలోని రియల్ టాలెంట్​ను బయటపెట్టాడు. అదే టైమ్​లో ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్​ జోడీని సెట్ చేశాడు. వీళ్లిద్దరూ అదరగొడుతున్నారు. 25 కోట్ల ఆటగాడు మిచెల్ స్టార్క్ ఫెయిలైనా పదే పదే అవకాశాలు ఇస్తుండటంతో అతడు కూడా సక్సెస్ అవుతున్నాడు. దీంతో అందరూ గంభీర్​ను మెచ్చుకుంటున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా కేకేఆర్ టీమ్​లో అతడి డామినేషన్ ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కోచ్ చంద్రకాంత్ పండిట్, కెప్టెన్ అయ్యర్ కంటే కూడా గంభీర్ ఆధిపత్యం ఎక్కువైందని, టీమ్​కు సంబంధించిన ప్రతి కీలక నిర్ణయంలోనూ అతడి డామినేషన్ నడుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఫీల్డింగ్ పొజిషన్స్ దగ్గర నుంచి బౌలింగ్ ఛేంజెస్ వరకు అన్నీ అతడు చెప్పినట్లే అమలు అవుతున్నాయని క్రికెట్ వర్గాల సమాచారం. అయ్యర్, చంద్రకాంత్ పండిట్​ను డమ్మీ చేసి రియల్ గేమ్​ను గంభీర్ వెనుక నుంచి ఆడుతున్నాడని అంటున్నారు. దీనికి మరింత ఊతమిచ్చేలా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బౌలర్ స్టార్క్ గంభీర్ దగ్గరకు వచ్చి ఏదో చర్చించడం, పక్కనే ఉన్న మెయిన్ కోచ్ సైలెంట్​గా ఉండటం, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా గౌతీతోనే డిస్కస్ చేయడాన్ని చూడొచ్చు. కేకేఆర్ గెలిస్తే గంభీర్​ను హైలైట్ చేస్తున్నారని, అదే ఓడిపోతే మాత్రం కెమెరాల్లో కూడా అయ్యర్​ను ఎక్కువగా చూపిస్తున్నారని.. ఇది కరెక్ట్ కాదని నెటిజన్స్ అంటున్నారు. మరి.. కేకేఆర్​లో గంభీర్ డామినేషన్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.