iDreamPost

గంభీర్, చంద్రకాంత్ కాదు.. KKR రియల్ హీరో అతడే! అయ్యర్ సేన వెనుక అదృశ్య శక్తి!

  • Published May 27, 2024 | 6:27 PMUpdated May 27, 2024 | 6:27 PM

కోల్​కతా నైట్ రైడర్స్ జట్టు అనుకున్నది సాధించింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి అదరగొడుతూ వచ్చిన అయ్యర్ సేన.. ఫైనల్ ఫైట్​లో గెలిచి కప్పును ఎగరేసుకుపోయింది. అయితే ఆ టీమ్ సక్సెస్​లో కీలకమైన ఓ హీరోను ఎవరూ గుర్తించడం లేదు.

కోల్​కతా నైట్ రైడర్స్ జట్టు అనుకున్నది సాధించింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి అదరగొడుతూ వచ్చిన అయ్యర్ సేన.. ఫైనల్ ఫైట్​లో గెలిచి కప్పును ఎగరేసుకుపోయింది. అయితే ఆ టీమ్ సక్సెస్​లో కీలకమైన ఓ హీరోను ఎవరూ గుర్తించడం లేదు.

  • Published May 27, 2024 | 6:27 PMUpdated May 27, 2024 | 6:27 PM
గంభీర్, చంద్రకాంత్ కాదు.. KKR రియల్ హీరో అతడే! అయ్యర్ సేన వెనుక అదృశ్య శక్తి!

కోల్​కతా నైట్ రైడర్స్ జట్టు అనుకున్నది సాధించింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి అదరగొడుతూ వచ్చిన అయ్యర్ సేన.. ఫైనల్ ఫైట్​లో గెలిచి కప్పును ఎగరేసుకుపోయింది. చెపాక్ స్టేడియంలో జరిగిన టైటిల్ ఫైట్​లో 8 వికెట్ల తేడాతో నెగ్గి ఛాంపియన్స్​గా అవతరించింది. మొదట బౌలింగ్​లో అదరగొట్టి సన్​రైజర్స్​ను 113 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​లో చెలరేగి ఈజీ టార్గెట్​ను 10.3 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. 10 ఏళ్ల తర్వాత కప్పును ఒడిసిపట్టింది కోల్​కతా. ఓవరాల్​గా ఆ టీమ్​కు ఇది మూడో ట్రోఫీ కావడం విశేషం. కేకేఆర్ విజేతగా నిలవడంతో ఆ జట్టు అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ముందుండి నడిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​ను మెచ్చుకుంటున్నారు.

అయ్యర్​తో పాటు మెంటార్ గౌతం గంభీర్, కోచ్ చంద్రకాంత్ పండిట్​ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్. అయ్యర్, గంభీర్, చంద్రకాంత్​ను మెచ్చుకోవడంలో తప్పు లేదు. జట్టు కోసం వాళ్లు ఎంతో శ్రమించారు. టీమ్ కాంబినేషన్​ను భలేగా సెట్ చేశారు. సునీల్ నరైన్​ను ఓపెనర్​గా దింపడం, ఫెయిలైనా మిచెల్ స్టార్క్​పై నమ్మకం ఉంచడం వర్కౌట్ అయ్యాయి. అయితే కేకేఆర్ వరుస విజయాలు, ఛాంపియన్​గా అవతరించడం వెనుక ఒక రియల్ హీరో ఉన్నాడు. వెనుక ఉండి అయ్యర్ సేనను అద్భుతంగా నడిపించిన ఆ అదృశ్య శక్తి గురించి చాలా మందికి తెలియదు. ఆ సీక్రెట్ పవర్ మరెవరో కాదు.. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్. జట్టు విజయాల్లో అతడికి కూడా కీలక పాత్ర ఉంది.

అసిస్టెంట్ కోచ్​గా ఉంటూ కేకేఆర్ టీమ్ సక్సెస్​లో తన వంతు పాత్ర పోషించాడు అభిషేక్ నాయర్. ఇంటర్నేషనల్ ప్లేయర్లను డీల్ చేయడం, గెలుపు కోసం వ్యూహాలు రచించడాన్ని గంభీర్, చంద్రకాంత్ పండిట్ చూసుకున్నారు. అభిషేక్ మాత్రం డొమెస్టిక్ ప్లేయర్లపై ఫోకస్ పెట్టాడు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అంగ్క్రిష్ రఘువంశీ, రమణ్​దీప్ సింగ్ లాంటి ప్రతిభ కలిగిన ఆటగాళ్లను వెతికి పట్టుకొని టీమ్​లోకి తీసుకొచ్చాడు. రింకూ సింగ్ టీమిండియా తరఫున సక్సెస్ అవడంలోనూ అతడి రోల్ ఉంది. అభిషేక్ కోచింగ్​లో రాటుదేలడంతోనే కేకేఆర్​, ఆ తర్వాత భారత్ తరఫున సత్తా చాటాడు రింకూ. ఈ సీజన్​లో రఘువంశీని​ ట్రైన్ చేసి అవసరాలకు తగ్గట్లు వాడుకున్నాడు. ఫారెన్ స్టార్స్, టీమిండియా ప్లేయర్లతో పాటు ఇలాంటి దేశవాళీ ఆటగాళ్లు రాణిస్తేనే టీమ్ గెలుస్తుందని అభిషేక్​కు తెలుసు. అందుకే టాలెంటెడ్ ప్లేయర్లను వెతికి వారిని సానబెట్టి ఆడించాడు. కేకేఆర్​ను ఛాంపియన్​గా నిలబెట్టడంలో నాయర్ పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పడానికి డొమెస్టిక్ ప్లేయర్ల సక్సెస్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి