iDreamPost
android-app
ios-app

KKR, రాజస్థాన్ కాదు.. IPL ట్రోఫీ ఎగరేసుకుపోయేది ఆ జట్టే: ఇర్ఫాన్ పఠాన్

  • Published May 17, 2024 | 4:19 PMUpdated May 17, 2024 | 4:19 PM

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​లో మూడు బెర్త్​లు కన్ఫర్మ్ అయ్యాయి. కోల్​కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్​తో పాటు సన్​రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్​కు చేరుకున్నాయి. ఇంకో స్పాట్ కోసం ఆర్సీబీ-సీఎస్​కే ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​లో మూడు బెర్త్​లు కన్ఫర్మ్ అయ్యాయి. కోల్​కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్​తో పాటు సన్​రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్​కు చేరుకున్నాయి. ఇంకో స్పాట్ కోసం ఆర్సీబీ-సీఎస్​కే ఢీ అంటే ఢీ అంటున్నాయి.

  • Published May 17, 2024 | 4:19 PMUpdated May 17, 2024 | 4:19 PM
KKR, రాజస్థాన్ కాదు.. IPL ట్రోఫీ ఎగరేసుకుపోయేది ఆ జట్టే: ఇర్ఫాన్ పఠాన్

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​లో మూడు బెర్త్​లు కన్ఫర్మ్ అయ్యాయి. కోల్​కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్​తో పాటు సన్​రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్​కు చేరుకున్నాయి. ఇంకొక్క స్పాట్ కోసం ఆర్సీబీ-సీఎస్​కే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య శనివారం డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. ఇందులో చెన్నై గెలిస్తే చాలు.. ప్లేఆఫ్స్ వెళ్తుంది. కానీ బెంగళూరు మాత్రం బిగ్ మార్జిన్​తో నెగ్గాలి. అప్పుడే క్వాలిఫై అవ్వగలదు. చావోరేవోలా మారిన ఈ పోరాటం గురించి ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. ఏ టీమ్ ప్లేఆఫ్స్​కు వెళ్తుంది? ఎవరు కప్పు నెగ్గుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో టీమిండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కేకేఆర్, రాజస్థాన్ కాదు.. ఈసారి ఆర్సీబీ జట్టు ఐపీఎల్ కప్‌ ఎగరేసుకుపోవడం ఖాయమని పఠాన్ జోస్యం పలికాడు. ఆ టీమ్ ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయితే కష్టమని.. మరింత డేంజరస్​గా మారుతుందన్నాడు. వరుస విజయాలతో జోష్ మీదున్న బెంగళూరును ఆపడం ఎవరి తరం కాదన్నాడు పఠాన్. ‘రేపటి ఫైట్​లో నెగ్గడం రెండు జట్లకు అంత సులువు కాదు. అయితే ఇప్పుడు ఆర్సీబీ మంచి ఊపు మీద ఉంది. అటు చూస్తే చెన్నై కాస్త డల్​గా ఉంది. పత్తిరానా, ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ లేకపోవడంతో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఒకవేళ రుతురాజ్ సేనను ఓడించి గానీ బెంగళూరు నెక్స్ట్ స్టేజ్​కు వస్తే మాత్రం ప్లేఆఫ్స్​కు వెళ్లిన మిగిలిన మూడు టీమ్స్​కు ఎంతో ప్రమాదకరం. ఇప్పుడు బెంగళూరు తోపు ఫామ్​లో ఉంది. ప్లేఆఫ్స్​కు వస్తే మాత్రం కప్పు తీసుకొనే వెళ్లేలా కనిపిస్తోంది’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

రేపటి పోరులో సీఎస్​కే కంటే ఆర్సీబీనే ఫేవరెట్​గా కనిపిస్తోందని పఠాన్ అన్నాడు. గాయాల సమస్యలు, నయా కెప్టెన్, ధోని లీడర్​గా లేకపోవడం టీమ్​కు కాస్త నెగెటివ్​గా మారిందన్నాడు. అయితే బిగ్ మ్యాచెస్​లో ఎలా ఆడాలనే ట్రిక్ చెన్నైకి బాగా తెలుసన్నాడు. రుతురాజ్-ధోని కలసి టీమ్​ను గట్టెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారని పఠాన్ పేర్కొన్నాడు. కాగా, ఒకవేళ వర్షం కారణం రేపటి మ్యాచ్​ రద్దయితే బెంగళూరుకు నిరాశే. చెన్నై ప్లేఆఫ్స్​కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ రిజల్ట్​తో ప్లేఆఫ్స్ రేసు ముగుస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగితే ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో సీఎస్​కేను ఓడించాలి. అదే మొదట బౌలింగ్ చేస్తే ఇంకో 11 బంతులు ఉండగానే ఛేజింగ్ పూర్తవ్వాలి. మరి.. పఠాన్ చెప్పినట్లు ఆర్సీబీ కప్పు కొడుతుందని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి