Nidhan
ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్‌ను మళ్లీ ఎగతాళి చేశారు ఫ్యాన్స్. టీమ్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలోనూ పాండ్యాకు అవమానం తప్పలేదు. ఈ టైమ్‌లో రోహిత్ శర్మ ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.
ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్‌ను మళ్లీ ఎగతాళి చేశారు ఫ్యాన్స్. టీమ్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలోనూ పాండ్యాకు అవమానం తప్పలేదు. ఈ టైమ్‌లో రోహిత్ శర్మ ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.
Nidhan
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ గెలుపోటములు కంటే కూడా ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాగా హైలైట్ అవుతున్నాడు. ఎంఐ మ్యాచ్ అంటే మొత్తం హార్దిక్ చుట్టూనే విషయాలు నడుస్తున్నాయి. మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు పాండ్యాను ఫ్యాన్స్ వదలడం లేదు. కెప్టెన్సీ మార్పు అంశంలో కోపంతో ఉన్న రోహిత్ శర్మ అభిమానులు హార్దిక్‌ను ఎక్కడ దొరికితే అక్కడ ఆడుకుంటున్నారు. ఫస్ట్ మ్యాచ్‌లో కుక్క.. కుక్క అంటూ అతడ్ని దారుణంగా అవమానించారు. హైదరాబాద్‌లోనూ రోహిత్ ఫ్యాన్స్ నుంచి పాండ్యాకు సెగ తగిలింది. ముంబై హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలోనూ అతడికి హిట్‌మ్యాన్ అభిమానుల నుంచి అవమానం తప్పలేదు. అయితే హార్దిక్‌ను ఫ్యాన్స ఎగతాళి చేస్తున్న టైమ్‌లో రోహిత్ కలుగజేసుకున్నాడు.
ముంబై ఇండియన్స్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ కొత్త కెప్టెన్ హార్దిక్‌ను అభిమానులు ఎగతాళి చేస్తూ వస్తున్నారు. వాంఖడేలోనూ ఇదే రిపీట్ అయింది. బూ.. అంటూ పాండ్యాను అవమానించారు ఫ్యాన్స్. దీంతో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ కలుగజేసుకున్నాడు. ఇది కరెక్ట్ కాదని.. ఇక ఎగతాళి చేయడం ఆపమంటూ అభిమానులకు సైగలు చేశాడు హిట్‌మ్యాన్. ఫ్యాన్స్ వైపు చూస్తూ చేతులతో ఇక చాలు ఆపండి అంటూ రోహిత్ సైగలు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ అతడ్ని మెచ్చుకుంటున్నారు. కెప్టెన్సీ వివాదంలో కోపం ఉన్నా హార్దిక్‌కు సపోర్ట్‌గా రోహిత్ నిలవడం గొప్ప విషయమని అంటున్నారు. ఎగతాళి చేయడం కరెక్ట్ కాదంటూ ఫ్యాన్స్‌ను వారించడాన్ని ప్రశంసించాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.
పాండ్యా ఎగతాళి అంశాన్ని పక్కనబెడితే ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది ముంబై. ఆడిన మూడో మ్యాచ్‌లోనూ ఓడింది హార్దిక్ సేన. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్ ఫెయిల్యూరే ముంబై కొంపముంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ టీమ్ 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయారు. టీమ్‌లో లుకలుకలు, బ్యాటింగ్ ఫెయిల్యూర్, జట్టుగా కలసికట్టుగా ఆడలేకపోవడం, కెప్టెన్‌గా హార్దిక్ బాధ్యతతో ఆడకపోవడం ముంబై వరుస ఓటములకు కారణాలుగా కనిపిస్తున్నాయి. మరి.. హార్దిక్‌ను ఎగతాళి చేయొద్దంటూ రోహిత్ సైగలు చేయడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: 20 కోట్ల ప్రైజ్ మనీకి 200 కోట్ల ఖర్చు.. IPLలో ఓనర్స్‌కి ఆదాయం ఎలా వస్తుందంటే?
Rohit Sharma asking the crowd to stop the boo…!!!
– Nice gesture by Hitman. 👏 pic.twitter.com/0cnRZoIC2P
— Johns. (@CricCrazyJohns) April 1, 2024
Excellent gesture from Rohit Sharma👏
📸: Jio Cinema pic.twitter.com/c5jGyPemFs
— CricTracker (@Cricketracker) April 1, 2024