iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన పంజాబ్.. CSK సహా ఏ టీమ్ వల్ల కానిది చేసి చూపించారు!

  • Published Apr 05, 2024 | 10:27 AM Updated Updated Apr 05, 2024 | 11:11 AM

పంజాబ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో ఏ టీమ్ వల్ల కానిది ధావన్ సేన చూసి చూపించింది.

పంజాబ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో ఏ టీమ్ వల్ల కానిది ధావన్ సేన చూసి చూపించింది.

  • Published Apr 05, 2024 | 10:27 AMUpdated Apr 05, 2024 | 11:11 AM
చరిత్ర సృష్టించిన పంజాబ్.. CSK సహా ఏ టీమ్ వల్ల కానిది చేసి చూపించారు!

టీ20ల్లో ఛేజింగ్ అంటే ఏ టీమ్ అయినా భయపడుతుంది. అందులోనూ 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరును ఛేదించాలంటే ఎంతటి స్ట్రాంగ్ టీమ్​కు అయినా ఈజీ కాదు. వికెట్లు పడుతున్న టైమ్​లో క్రీజులో నిలదొక్కుకొని ఛేజింగ్ చేయడం చాలా కష్టం. అందుకే చాలా జట్లు తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపుతాయి. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా ఛేజింగ్​కు ఇష్టపడవు. అయితే సాధారణ జట్టుగా పేరు తెచ్చుకున్న ఆ టీమ్ మాత్రం ఛేదనలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును అందుకుంది. ఆ జట్టే పంజాబ్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్​కతా నైట్ రైడర్స్, సన్​రైజర్స్ హైదరాబాద్ వంటి టాప్ టీమ్స్​ వల్ల కానిది పంజాబ్ సాధించింది.

పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. 200 లేదా అంతకంటే ఎక్కువ టార్గెట్​ను అత్యధిక సార్లు ఛేదించిన జట్టుగా ధావన్ సేన నిలిచింది. గుజరాత్ టైటాన్స్​తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ ద్వారా ఈ అరుదైన ఫీట్​ను అందుకుంది పంజాబ్. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ.. ఓవర్లన్నీ ఆడి 199 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ లాస్ట్ ఓవర్​లో విజయాన్ని అందుకుంది. తద్వారా ఎక్కువ సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ టార్గెట్​ను ఛేజ్ చేసిన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు పంజాబ్ 6 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లను ఛేదించింది. ఈ లిస్ట్​లో ముంబై (5 సార్లు) తర్వాతి స్థానంలో ఉంది. ఇక, జీటీతో మ్యాచ్​లో ఒక దశలో 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిందా టీమ్. ఇక ధావన్ సేన గెలవడం కష్టమే.. కొండంత స్కోరును ఛేజ్ చేయలేదని అంతా అనుకున్నారు.

ఆ టైమ్​లో శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్​తో విరుచుకుపడ్డాడు. శశాంక్​కు తోడుగా అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31) కూడా చెలరేగి బ్యాటింగ్ చేశాడు. వీళ్లిద్దరూ పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సులు బాదుతూనే మధ్య మధ్యలో సింగిల్స్, డబుల్స్​తో స్కోరు బోర్డును ఎక్కడా ఆగకుండా చూసుకున్నారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆఖర్లో అశుతోష్ ఔట్ అవడంతో ఏమవుతుందోననే టెన్షన్ నెలకొంది. అయితే శశాంక్ చివరి వరకు నిలబడి విన్నింగ్ షాట్​తో మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. ధావన్, బెయిర్​స్టో, సామ్ కర్రన్, సికిందర్ రజా లాంటి స్టార్ బ్యాటర్లు ఔటైనా.. ఈ డొమెస్టిక్ స్టార్స్ కలసి మ్యాచ్​ను ముగించారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్స్ టేబుల్​లో 5వ స్థానానికి చేరుకుంది. మరి.. పంజాబ్ నయా రికార్డుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.