iDreamPost
android-app
ios-app

నటరాజన్ బర్త్ డే పార్టీ.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో!

  • Published Apr 04, 2024 | 8:58 PM Updated Updated Apr 04, 2024 | 8:58 PM

సన్ రైజర్స్ స్టార్ బౌలర్ నటరాజన్ బర్త్ డే పార్టీకి ఊహించని గెస్ట్ సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. పైగా ఆ గెస్ట్ ఓ స్టార్ హీరో. మరి నటరాజన్ పుట్టినరోజుకు స్టార్ హీరో ఎందుకు వచ్చాడు? ఆ వివరాల్లోకి వెళితే..

సన్ రైజర్స్ స్టార్ బౌలర్ నటరాజన్ బర్త్ డే పార్టీకి ఊహించని గెస్ట్ సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. పైగా ఆ గెస్ట్ ఓ స్టార్ హీరో. మరి నటరాజన్ పుట్టినరోజుకు స్టార్ హీరో ఎందుకు వచ్చాడు? ఆ వివరాల్లోకి వెళితే..

నటరాజన్ బర్త్ డే పార్టీ.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో!

సన్ రైజర్స్ స్టార్ బౌలర్ నటరాజన్ ఏప్రిల్ 4న తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇందులో విశేషం ఏముంది? అందరూ జరుపుకునేదేగా.. అని అనుకుంటున్నారా? ఇది కూడా నిజమే. కానీ నటరాజన్ బర్త్ డేకి అనుకోని అతిథి సడెన్ ఎంట్రీ ఇచ్చి.. అందరికి షాకిచ్చాడు. ఆ అతిథి స్టార్ హీరో కావడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. మరి ఇంతకీ నట్టూ బర్త్ డేకి అనుకోకుండా హాజరైన హీరో ఎవరు? అలా సడెన్ ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. కాగా.. నేడు(ఏప్రిల్ 4) సన్ రైజర్స్ ప్లేయర్ నటరాజన్ పుట్టినరోజు కావడంతో.. టీమ్ అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ బర్త్ డే పార్టీకి అనుకోని అతిథి వచ్చి అందరికి షాకిచ్చాడు. ఆ హోటల్ లోనే బస చేస్తున్న హీరో అజిత్.. నటరాజన్ బర్త్ డే అని తెలుసుకుని ఆ వేడుకకి సడెన్ ఎంట్రీ ఇచ్చాడు.

star hero sudden entry to natarajan bday

ఇది ఊహించని నట్టూ షాక్ కు గురైయ్యాడు. అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యంలో ముగినిగిపోయారు. అజిత్ కేక్ కట్ చేసి నటరాజన్ కు తినిపించాడు. తన అభిమాన హీరో సమక్షంలో పుట్టినరోజు నిర్వహించుకోవడం జీవితంలో మర్చిపోలేనని నట్టూ తెలిపాడు. ఇక ఈ వేడుకకి దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తో పాటుగా ఇతర ప్లేయర్లు ఉన్నారు. వారందరూ అజిత్ తో ఫొటోలు దిగి పార్టీని ఎంజాయ్ చేశారు. మరి నటరాజన్ బర్త్ డేకి సడెన్ ఎంట్రీ ఇచ్చిన హీరో అజిత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet