Nidhan
గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ టీమ్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.
గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ టీమ్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం.
Nidhan
గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్లో ఫేవరెట్ టీమ్స్‌లో ఒకటి. రెండేళ్ల కింద టైటిల్‌ను కొట్టేసిన ఆ జట్టు.. గతేడాది రన్నరప్‌గా నిలిచింది. ఈసారి శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో బాగానే ఆడుతోంది. గిల్‌తో పాటు డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, వృద్ధిమాన్ సాహా లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ కలిగిన జీటీ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. అయితే ఇంత మంచి టాలెంటెడ్ బ్యాటర్లు కలిగిన టీమ్ ఇవాళ అనూహ్యంగా కుప్పకూలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 89 పరుగులకే ఆలౌట్ అయింది జీటీ. తద్వారా ఓ చెత్త రికార్డును నెలకొల్పింది.
ఢిల్లీతో మ్యాచ్‌లో 89 పరుగులకే ఆలౌట్ అయిన గుజరాత్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఆ టీమ్ హిస్టరీలో 100 పరుగుల్లోపే కుప్పకూలడం ఇదే ఫస్ట్ టైమ్. మూడేళ్లుగా ఐపీఎల్లో అదరగొడుతున్న జీటీ లోస్కోర్లు ఎప్పుడూ చేయలేదు. అలాంటిది ఇవాళ డీసీతో మ్యాచ్‌లో అనూహ్యంగా ఆలౌట్ అయింది. టీమ్‌లో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. స్పిన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్ అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతడు ఆఖర్లో వచ్చి బ్యాట్ ఝళిపించకపోతే ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. రషీద్ తర్వాత సాయి సుదర్శన్ (12), రాహుల్ తెవాటియా (10) మాత్రమే డబుల్ ఫిగర్స్‌కు చేరుకున్నారు. కెప్టెన్ గిల్ (8) సహా బ్యాటర్స్ అంతా ఫెయిలయ్యారు. డీసీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ చెరో 2 వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్ 3 వికెట్లతో చెలరేగాడు.
GUJARAT TITANS DISMISSED UNDER 100 FOR THE FIRST TIME IN IPL HISTORY 🤯
– Pant & his boys creating magic in IPL 2024. pic.twitter.com/5JaLWMRxtj
— Johns. (@CricCrazyJohns) April 17, 2024