iDreamPost
android-app
ios-app

వీడియో: తెవాటియాకు బౌలింగ్ చేస్తున్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా? అస్సలు నమ్మలేరు!

  • Published Apr 17, 2024 | 5:39 PM Updated Updated Apr 17, 2024 | 5:39 PM

క్రికెటర్ల పర్సనల్ లైఫ్​కు సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ల ఫ్యామిలీ, వారసులు ఎవరనే విషయాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు.

క్రికెటర్ల పర్సనల్ లైఫ్​కు సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ల ఫ్యామిలీ, వారసులు ఎవరనే విషయాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు.

  • Published Apr 17, 2024 | 5:39 PMUpdated Apr 17, 2024 | 5:39 PM
వీడియో: తెవాటియాకు బౌలింగ్ చేస్తున్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా? అస్సలు నమ్మలేరు!

క్రికెటర్ల పర్సనల్ లైఫ్​కు సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందులోనూ స్టార్స్, లెజెండరీ క్రికెటర్స్​ విషయంలో ఇది మరీ ఎక్కువ. వాళ్ల ఫ్యామిలీ, వారసులు ఎవరనే విషయాలను తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. సోషల్ మీడియాలోనూ స్టార్స్, వాళ్ల కుటుంబాలకు చెందిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతుండటం చూస్తుంటాం. అలాగే ఇప్పుడు కూడా ఓ లెజెండరీ క్రికెటర్ కుమారుడి వీడియో ఒకటి హల్​చల్ చేస్తోంది. గుజరాత్ టైటాన్స్ పించ్ హిట్టర్ రాహుల్ తెవాటియాతో కలసి క్రికెట్ ఆడుతున్న ఈ పిల్లాడ్ని గుర్తుపట్టారా? అతడు ఎవరో అస్సలు నమ్మలేరు.

ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కుమారుడి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​కు కోచ్​గా ఉన్నాడు పాంటింగ్. దీంతో అతడి కుమారుడు ఫ్లెచర్ విలియమ్ పాంటింగ్ సరదాగా గ్రౌండ్​కు వచ్చాడు. ఇవాళ డీసీకి గుజరాత్ టైటాన్స్​కు మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో గ్రౌండ్​లో జీటీ బ్యాటర్ రాహుల్ తెవాటియా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదే టైమ్​కు జూనియర్ పాంటింగ్ అక్కడికి వచ్చాడు. దీంతో అతడ్ని పలకరించిన తెవాటియా.. నువ్వు బ్యాటర్​వా? ఆల్​రౌండర్​వా? అని అడిగాడు. దీనికి ఆ పిల్లాడు స్పందిస్తూ.. తాను ఆల్​రౌండర్​నని చెప్పాడు. ఫాస్ట్ బౌలింగ్ చేస్తావా? నీ స్పీడ్ ఎంతో చూపించంటూ అతడ్ని ఆటపట్టించాడు తెవాటియా. పాంటింగ్ తన కొడుకు చేతికి బాల్ అందించాడు. దీంతో ఆ పిల్లాడు బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు.

యార్కర్ల​తో తెవాటియాను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు జూనియర్ పాంటింగ్. అయితే స్టార్ బ్యాటర్ మాత్రం కూల్​గా డిఫెన్స్ చేశాడు. ఆ తర్వాత పిల్లాడు స్పిన్ డెలివరీస్ కూడా వేస్తూ తన టాలెంట్​ను నిరూపించుకున్నాడు. ఆ టైమ్​లో పాంటింగ్ వెనుక నుంచి చూస్తున్నాడు. ఇది ముగిసిన తర్వాత జూనియర్ పాంటింగ్-తెవాటియా ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, పాంటింగ్ కోచింగ్​లో ఢిల్లీ క్యాపిటల్స్ అంతగా విజయాలు సాధించకున్నా అటాకింగ్​ గేమ్​తో ప్రత్యర్థులను భయపెడుతోంది. రిషబ్ పంత్​తో పాటు ఇతర ఆటగాళ్లను అగ్రెసివ్​గా ఆడిస్తూ టీమ్​లో జోష్ నింపుతున్నాడు పాంటింగ్.