iDreamPost
android-app
ios-app

RCB వదిలించుకున్న శని పంజాబ్​కు.. హర్షల్ పటేల్.. ఏ రియల్ రన్ మెషిన్!

  • Published Mar 23, 2024 | 9:35 PM Updated Updated Mar 23, 2024 | 9:35 PM

పంజాబ్ కింగ్స్​లోని ఓ బౌలర్​ టీమ్​కు శనిలా దాపురించాడు. ఆర్సీబీ వదిలించుకున్న ఆ బౌలర్.. ఇప్పుడు పంజాబ్​లోకి వచ్చాడు. కానీ ఏం లాభం.. టీమ్ మారినా అతడి గేమ్ మారలేదు.

పంజాబ్ కింగ్స్​లోని ఓ బౌలర్​ టీమ్​కు శనిలా దాపురించాడు. ఆర్సీబీ వదిలించుకున్న ఆ బౌలర్.. ఇప్పుడు పంజాబ్​లోకి వచ్చాడు. కానీ ఏం లాభం.. టీమ్ మారినా అతడి గేమ్ మారలేదు.

  • Published Mar 23, 2024 | 9:35 PMUpdated Mar 23, 2024 | 9:35 PM
RCB వదిలించుకున్న శని పంజాబ్​కు.. హర్షల్ పటేల్.. ఏ రియల్ రన్ మెషిన్!

క్రికెట్​లో కొందరు లక్ ఉన్న ప్లేయర్లు ఉంటారు. టాలెంట్​కు లక్ తోడైతే వాళ్లను ఆపడం కష్టం. ఇలాంటి ఆటగాళ్ల వల్ల వాళ్లకు పర్సనల్​గా కలసిరావడమే గాక ఫ్రాంచైజీకి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. జెంటిల్మన్ గేమ్​లో కొందరు శని లాంటి ఆటగాళ్లు ఉంటారు. వాళ్లు టీమ్​లో ఉంటే గెలిచే మ్యాచ్​లో కూడా టీమ్ ఓడిపోతుంది. వ్యక్తిగత ప్రదర్శన బాగోకపోగా.. దీని వల్ల జట్టు విజయావకాశాలు కూడా ప్రభావితం అవుతాయి. అందుకే ఇలాంటి ప్లేయర్లను ఏ టీమ్​ కూడా కంటిన్యూ చేయదు. వాళ్లను బయటకు పంపేస్తుంది. ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఇలాంటి బౌలర్ ఒకడు ఉండేవాడు. అయితే అతడి గోస తట్టుకోలేక టీమ్ వదిలేసింది. అతడు కాస్తా వచ్చి పంజాబ్​ కింగ్స్​లో పడ్డాడు. ఇప్పుడు ధావన్ సేనకు అతడు శనిలా దాపురించాడు.

మనం మాట్లాడుకుంటున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు.. హర్షల్ పటేల్. ఒకప్పుడు ఆర్సీబీ తరఫున ఆడాడీ పేసర్. అయితే గెలిచే మ్యాచుల్లో కూడా హర్షల్ చెత్త బౌలింగ్​తో బెంగళూరు పలు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో అతడ్ని వదిలేసుకుందా ఫ్రాంచైజీ. కానీ ఈ సీజన్​కు ముందు జరిగిన మినీ ఆక్షన్​లో రూ.11.75 కోట్ల భారీ ధర చెల్లించి మరీ హర్షల్​ను దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. ఎవరు సజెస్ట్ చేశారో గానీ ఆ టీమ్ అతడి కోసం పట్టు వదలకుండా పోరాడి సొంతం చేసుకుంది. హర్షల్​ను ఎందుకు తీసుకున్నారు? అతడో శని అంటూ అప్పట్లో పంజాబ్ ఫ్యాన్స్ విమర్శించారు. అదే ఇప్పుడు నిజమైంది. ఢిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో హర్షల్ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.

డీసీతో మ్యాచ్​లో 4 ఓవర్లు వేసిన హర్షల్.. ఏకంగా 47 పరుగులు ఇచ్చుకున్నాడు. రిషబ్ పంత్​తో పాటు రికీ భుయ్​ను అతడు ఔట్ చేశాడు. కానీ అప్పటికే పంత్ ఇచ్చిన క్యాచ్​ను అతడు మిస్ చేశాడు. హర్షల్ బౌలింగ్​లో కొత్త కుర్రాడు అభిషేక్ పోరెల్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఆఖరి ఓవర్​లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. హర్షల్ ఎటు బంతి వేస్తే అటు షాట్లు బాదుతూ భయపెట్టాడు. 150 పరుగులైనా చేస్తుందా అని అనుకున్న డీసీ కాస్తా 174 రన్స్ చేసింది. దీంతో హర్షల్ పటేల్​ను సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఆర్సీబీని ముంచాడు.. ఇప్పుడు పంజాబ్​ను తగులుకున్నాడని విమర్శిస్తున్నారు. విరాట్ కోహ్లీ కాదు.. రియల్ రన్ మెషీన్ హర్షలేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. హర్షల్​ను పక్కనబెట్టి ఇంకో యంగ్​స్టర్​కు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మరి.. పంజాబ్​ను ముంచేసిన ఆర్సీబీ శని బౌలర్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.