Nidhan
ఈసారి ఐపీఎల్లో ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో వేటకు సిద్ధమైంది. వరుస ఓటములతో డీలాపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది రుతురాజ్ సేన.
ఈసారి ఐపీఎల్లో ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో వేటకు సిద్ధమైంది. వరుస ఓటములతో డీలాపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది రుతురాజ్ సేన.
Nidhan
డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2024లో సూపర్ ఫామ్‌లో ఉంది. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి అపోజిషన్ టీమ్స్‌కు డేంజర్ సిగ్నల్స్ పంపించింది. సీనియర్లు, కుర్రాళ్ల కలయికతో ఉన్న ఆ జట్టు వింటేజ్ సీఎస్కేను తలపిస్తూ రెచ్చిపోతోంది. అలాంటి రుతురాజ్ సేన ఇప్పుడు ఢిల్లీ క్యాపిటిల్స్‌తో మ్యాచ్‌కు రెడీ అయింది. ఈ రెండు టీమ్స్ మధ్య రేపు వైజాగ్‌లో మ్యాచ్ జరగనుంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి డీలాపడ్డ డీసీ.. సీఎస్కేను ఎలా ఎదుర్కొంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
చెన్నైతో సమరానికి సిద్ధమైన ఢిల్లీ జట్టులో బలాల కంటే బలహీనతలే ఎక్కువగా ఉన్నాయి. ఆ టీమ్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ మంచి స్టార్ట్ అందించడంలో ఫెయిలవుతున్నారు. వార్నర్ ఫర్వాలేదనిపిస్తున్నా మార్ష్ త్వరగా ఔటై నిరాశపరుస్తున్నాడు. రికీ భుయ్ రెండు మ్యాచుల్లోనూ తుస్సుమన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ మంచి స్టార్ట్ అందుకున్నా వాటిని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో రాణించిన అభిషేక్ పోరెల్ రెండో మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించలేకపోయాడు. స్టబ్స్ ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో నార్త్జే, ముకేశ్ కుమార్ ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. కుల్దీప్ కూడా రన్స్ లీక్ చేస్తుండటం మైనస్‌గా మారింది.
సీఎస్కేలో మైనస్‌లు తక్కువగా, ప్లస్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ కెప్టెన్ ధోని జట్టులో ఉండటం ఆ టీమ్‌కు బిగ్ ప్లస్. బ్యాటర్లు రచిన్ రవీంద్ర, శివమ్ దూబె సూపర్ ఫామ్‌లో ఉండటం అదనపు బలం. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి టచ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లోనూ ధోనీకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. దీన్ని బట్టే ఆ టీమ్ బ్యాటింగ్ యూనిట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లు రుతురాజ్-రచిన్ మంచి స్టార్ట్స్ ఇస్తూ భారీ స్కోరుకు పునాదులు వేస్తున్నారు. బౌలింగ్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ టీమ్‌ను లీడ్ చేస్తున్నాడు. అతడికి తోడుగా దీపక్ చాహర్, పత్తిరానా రాణిస్తుండటంతో చెన్నైకి ఎదురు లేకుండా పోయింది.
రెండు జట్ల బలాబలాలు, ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే రేపటి మ్యాచ్‌లో చెన్నై గెలుపు నల్లేరు మీద నడకే. ఈ ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 29 మ్యాచులు జరిగాయి. అందులో 10 మ్యాచుల్లో డీసీ నెగ్గగా.. 19 మ్యాచుల్లో సీఎస్కే విజయం సాధించింది. రుతురాజ్ సేన ఆడుతున్న తీరు చూస్తుంటే ఆ టీమ్‌ను ఆపడం డీసీ వల్ల కాదనే చెప్పాలి.
ఢిల్లీ:
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.
చెన్నై:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానె, డారిల్ మిచెల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్.