Nidhan
ఐపీఎల్-2024లో మరో ప్రయోగం చేసేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. ఇది వర్కౌట్ అయితే ఇక బ్యాటర్ల కష్టాలు తీరినట్లే.
ఐపీఎల్-2024లో మరో ప్రయోగం చేసేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. ఇది వర్కౌట్ అయితే ఇక బ్యాటర్ల కష్టాలు తీరినట్లే.
Nidhan
క్రికెట్లో నిబంధనలు మార్చడం కొత్తేమీ కాదు. మ్యాచులు చూసే ఆడియెన్స్ సౌలభ్యం కోసం గేమ్‌లో కొత్త రూల్స్ తీసుకురావడం తెలిసిందే. ఆటగాళ్ల ఇబ్బందులను తొలగించడానికి కూడా నిబంధనలు మారుస్తుంటారు. అయితే రూల్స్ మార్చడమే కాదు.. బ్యాగ్రౌండ్లో గేమ్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఎక్కువగా డొమెస్టిక్ లెవల్లో ప్రయోగాలు చేస్తుంటారు. టెక్నాలజీ ఆధారంగా తీసుకొచ్చే కొన్ని రూల్స్ వల్ల 100 పర్సెంట్ ఆక్యురెసీతో రిజల్ట్స్ రావాలంటే ఇది తప్పనిసరి. అలాంటి ఓ ఎక్స్‌పెరిమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఐపీఎల్-2024లో భారత బోర్డు మరో ప్రయోగం చేస్తోందని తెలిసింది. అసలు ఏంటా ఎక్స్పెరిమింట్? దాని వల్ల ఎవరికి ఉపయోగం? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఫుల్ టాస్‌ల విషయంలో అంపైర్లు ఇచ్చే నిర్ణయాలతో కొన్నిసార్లు బౌలింగ్ టీమ్స్, మరికొన్ని సార్లు బ్యాటింగ్ టీమ్స్ గొడవకు దిగడం చూసే ఉంటారు. వీటి వల్ల ఎక్కువగా బ్యాటర్లకు నష్టం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నడుము ఎత్తులో దూసుకొచ్చే ఫుల్ టాస్‌ల నిర్ణయాల విషయంలో కచ్చితత్వం కోసం బీసీసీఐ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. దీన్ని ఐపీఎల్-2024లో స్టార్ట్ చేసింది. భారత బోర్డు ఏర్పాటు చేసిన ఓ టీమ్ ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తోంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడుతున్న అందరు ప్లేయర్ల ఎత్తు, కొలతల్ని ఈ టీమ్ సేకరిస్తోందట. వెస్ట్ హై ఫుల్ టాస్‌ల విషయంలో రివ్యూకు వెళ్తే థర్డ్ అంపైర్స్ డిసిషన్స్ తీసుకుంటారు. ఈ నిర్ణయాల విషయంలో హాక్-ఐ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అందుకే ఆటగాళ్ల ఎత్తు, కొలతల డేటాను సేకరించి థర్డ్ అంపైర్ టీమ్‌కు అందించనున్నారని తెలుస్తోంది.
అంపైరింగ్ టీమ్ వినియోగించే కంప్యూటర్లలో ఈ డేటాను ఇన్స్టాల్ చేస్తారని.. తద్వారా టోర్నీలో ఇక మీదట జరిగే మ్యాచుల్లో హై ఫుల్ టాస్‌ల విషయంలో కచ్చితత్వం ఉండేలా బోర్డు ప్లాన్ చేసిందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని.. బీసీసీఐ నియమించిన టీమ్ తమ పనులు చేసుకుపోతోందని టాక్ నడుస్తోంది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ పూర్తయి, సీజన్లో ఏ సమయంలో అమల్లోకి వస్తుందో క్లారిటీ లేదు. బీసీసీఐ ప్రయోగం గురించి తెలిసిన నెటిజన్స్.. సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. బాడీ ఫుల్ టాస్ డిసిషన్స్‌లో సమస్యను పరిష్కరించేందుకు బోర్డు చేస్తున్న ప్రయోగం సూపర్ అని మెచ్చుకుంటున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఫుల్ టాస్‌ల విషయంలో ఎక్కువగా బ్యాటర్లు నష్టపోతున్నారని కామెంట్స్ చేస్తుఉన్నారు. మరి.. బీసీసీఐ ప్రయోగం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: RCB vs PBKS: విరాట్ కోహ్లీ పరువు కాపాడిన దినేష్ కార్తీక్!
People from BCCI’s team are measuring the height of all the players in IPL till their waist – this data will then be fed into the system used by the hawk-eyed operators who sit with the 3rd umpire to judge the waist-high full tosses in IPL 2024. [Gaurav Gupta from TOI] pic.twitter.com/HZxhB5bTvm
— Johns. (@CricCrazyJohns) March 26, 2024