iDreamPost
android-app
ios-app

IPLతో BCCI రియల్ గేమ్.. బోర్డు నుంచి ఇది ఎక్స్​పెక్ట్ చేయలేదు!

  • Published Mar 31, 2024 | 10:53 AM Updated Updated Mar 31, 2024 | 10:53 AM

ఐపీఎల్​ను బంగారు గుడ్లు పెట్టే బాతులాగే బీసీసీఐ చూస్తోందని అంతా అనుకుంటున్నారు. కానీ బోర్డు క్యాష్ రిచ్ లీగ్​తో రియల్ గేమ్ మొదలుపెట్టింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ​

ఐపీఎల్​ను బంగారు గుడ్లు పెట్టే బాతులాగే బీసీసీఐ చూస్తోందని అంతా అనుకుంటున్నారు. కానీ బోర్డు క్యాష్ రిచ్ లీగ్​తో రియల్ గేమ్ మొదలుపెట్టింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ​

  • Published Mar 31, 2024 | 10:53 AMUpdated Mar 31, 2024 | 10:53 AM
IPLతో BCCI రియల్ గేమ్.. బోర్డు నుంచి ఇది ఎక్స్​పెక్ట్ చేయలేదు!

భారత క్రికెట్ బోర్డుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్​ అంటే బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిదనేది తెలిసిందే. ఈ మెగా లీగ్ ద్వారా ఆటగాళ్లతో పాటు బోర్డు మీద కూడా కనకవర్షం కురుస్తోంది. బీసీసీఐ ఆదాయంలో బిగ్ షేర్ క్యాష్ రిచ్ లీగ్​ నుంచే వస్తోంది. అందుకే ఈ లీగ్​ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. క్రికెట్​లో అతిపెద్ద లీగ్​గా ఉన్న ఐపీఎల్​ను ఏటికేడు నెక్స్ట్ లెవల్​కు తీసుకెళ్తూ స్పోర్టింగ్ వరల్డ్​లో మరింత ఇమేజ్​ను పెంచింది బీసీసీఐ. అయితే వాస్తవానికి ఐపీఎల్​ను బంగారు బాతులా బోర్డు చూస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ క్యాష్ రిచ్ లీగ్​తో బోర్డు మొదటుపెట్టిన రియల్ గేమ్ గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. అసలు లీగ్​తో బీసీసీఐ ఏం చేస్తోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఈసారి ఐపీఎల్​ మ్యాచులకు ఆడియెన్స్​, ఫ్యాన్స్​తో పాటు స్టేడియాల్లోకి సెలక్టర్లు కూడా వెళ్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు మ్యాచుల్ని చూసి ఎంజాయ్ చేసేందుకు వెళ్తున్నారు. కానీ సెలక్టర్లు మాత్రం తమ డ్యూటీలో భాగంగానే స్టేడియాల్లో వాలిపోతున్నారు. ఈ ఏడాది జూన్​లో ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఐపీఎల్ తర్వాత తక్కువ టైమ్ గ్యాప్​లో మెగా టోర్నీ జరగనుంది. కాబట్టి ఆలోపే భారత జట్టులో ఎవరెవరు ఆడాలనే దాని మీద అంచనాకు వచ్చేయాలి. టీమ్స్​ను ప్రకటించాల్సిన టైమ్ కూడా దగ్గర పడుతోంది. దీంతో ఐపీఎల్​తో రియల్ గేమ్ స్టార్ట్ చేసింది బీసీసీఐ. నలుగురు సెలక్టర్ల బృందాన్ని మ్యాచులు జరిగే స్టేడియాలకు పంపుతోందట. చాలా మటుకు మ్యాచుల్ని ఈ బృందం కవర్ చేయనుందట.

టీమ్​లో ఇప్పటికే ప్లేస్ కన్ఫర్మ్ అనుకుంటున్న వారితో పాటు డొమెస్టిక్‌ ప్లేయర్ల ఆటతీరును కూడా నేషనల్ సెలక్టర్లు గమనిస్తున్నారని క్రికెట్ వర్గాల సమాచారం. ప్రతి ఆటగాడి గేమ్​ను దగ్గరగా గమనిస్తూ ఎప్పటికప్పుడు తమ నివేదికను బోర్డు పెద్దలకు పంపిస్తున్నారట. సీనియర్ ప్లేయర్లతో పాటు యంగ్ టాలెంట్ మీద కూడా సెలక్టర్లు ఓ కన్నేశారని.. వరల్డ్ కప్ టీమ్​లో షాకింగ్ ఛేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయని వినికిడి. ఇది తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. బీసీసీఐ ప్లాన్ సూపర్బ్ అని.. ఇది ఎక్స్​పెక్ట్ చేయలేదని అంటున్నారు. ఎంజాయ్​మెంట్ కోసం లీగ్ అని అందరూ అనుకుంటే, దీన్ని సీరియస్​గా తీసుకొని ఏకంగా వరల్డ్ కప్ స్క్వాడ్ సెలక్షన్ కోసం వాడుకోవడం గ్రేట్ అని చెబుతున్నారు. ఈసారి లీగ్​లో దుమ్మురేపుతున్న వాళ్లకు జట్టులో ఛాన్స్ ఇచ్చి, వాళ్లు వరల్డ్ కప్​లోనూ రాణిస్తే బోర్డు సక్సెస్ అయినట్లేనని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. బీసీసీఐ రియల్ గేమ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.