iDreamPost
android-app
ios-app

Dinesh Karthik: ఇంత బాగా ఆడుతున్నా వరల్డ్ కప్​ టీమ్​లో కార్తీక్​కు నో ఛాన్స్.. కారణం ఇదే!

  • Published Apr 16, 2024 | 6:35 PM Updated Updated Apr 16, 2024 | 6:35 PM

ఐపీఎల్-2024లో విధ్వంసక బ్యాటింగ్​తో టాక్ ఆఫ్​ ది టౌన్​గా మారాడు దినేష్ కార్తీక్. ఈ ఆర్సీబీ బ్యాటర్​ను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు.

ఐపీఎల్-2024లో విధ్వంసక బ్యాటింగ్​తో టాక్ ఆఫ్​ ది టౌన్​గా మారాడు దినేష్ కార్తీక్. ఈ ఆర్సీబీ బ్యాటర్​ను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు.

  • Published Apr 16, 2024 | 6:35 PMUpdated Apr 16, 2024 | 6:35 PM
Dinesh Karthik: ఇంత బాగా ఆడుతున్నా వరల్డ్ కప్​ టీమ్​లో కార్తీక్​కు నో ఛాన్స్.. కారణం ఇదే!

క్రికెటర్ టీమ్​లో అవసరమా అని ప్రశ్నించారు. వయసు అయిపోయింది పక్కన పెట్టేయండని విమర్శించారు. ఇంకెన్నాళ్లు ఆడతావ్.. వెళ్లి కామెంట్రీ చేసుకో అంటూ ట్రోల్స్ చేశారు. కానీ పడిలేచిన కెరటంలా బౌన్స్​ బ్యాక్ అయ్యాడా ప్లేయర్. తిట్టిన నోళ్లే ప్రశంసించేలా చేసుకున్నాడు. ఒక్కో అద్భుత ఇన్నింగ్స్​తో ఆటకు వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశాడు. యంగ్ బ్యాటర్లతో పోటీపడి పరుగులు చేస్తూ తనలో ఇంకా పస తగ్గలేదని చూపించాడు. అతడు మరెవరో కాదు.. ఆర్సీబీ సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తీక్. ఐపీఎల్-2024లో విధ్వంసక ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడుతున్నాడు డీకే. ఫినిషర్​గా తన రోల్​ను సమర్థంగా నిర్వర్తిస్తూ ఆర్సీబీకి అతిపెద్ద బలంగా మారాడు. అయితే ఇంత బాగా ఆడుతున్నా టీ20 వరల్డ్ కప్ టీమ్​లో డీకేకు నో ఛాన్స్ అనే చెప్పాలి.

క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్​లో దినేష్ కార్తీక్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఒకదాన్ని మించి మరో ఇన్నింగ్స్​తో బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. బౌండరీల వర్షం, సిక్సర్ల సునామీని సృష్టించి ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఆడిన 7 మ్యాచుల్లో 226 పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్​లో టాప్-10లో చోటు సంపాదించాడు. 205 స్ట్రయిక్ రేట్​తో బ్యాటింగ్ చేస్తూ తనలోని ఫినిషర్​ను క్రికెట్ వరల్డ్​కు పరిచయం చేశాడు. అయితే ఇంత బాగా ఆడుతున్నా, ఆఖర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్​లతో విధ్వంసం సృష్టిస్తున్నా జూన్​లో జరగబోయే టీ20 ప్రపంచ కప్​లో దినేష్ కార్తీక్ ఆడటం కష్టమే. దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. టీమిండియాలో ఇప్పటికే ఫినిషర్ రోల్స్​ కోసం శివం దూబె, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా రూపంలో ముగ్గురు సాలిడ్ ప్లేయర్స్​ ఉన్నారు.

దూబె, రింకూ రెగ్యులర్​గా భారత టీ20 జట్టుతో జర్నీ చేస్తున్నారు. ఇటీవల సౌతాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన పొట్టి ఫార్మాట్ సిరీస్​ల్లో వాళ్లిద్దరూ టీమ్ గెలుపు​లో కీలకపాత్ర పోషించారు. కాబట్టి టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​లో వాళ్లు ఉండటం పక్కా. గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇస్తున్న హార్దిక్ కూడా టీమ్​లో ఉంటాడు. వరుసగా విఫలమవుతున్నందున ఒకవేళ పాండ్యాను తీసుకోకపోయినా అతడి ప్లేస్​లో బ్యాకప్​గా మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్పిన్ ఆల్​రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్​​ను ఆ రోల్​ కోసం వాడుకునే అవకాశం ఉంది. కార్తీక్​కు వయసు మీద పడుతోంది. అతడికి ఇప్పుడు 38 ఏళ్లు.

చాన్నాళ్లుగా నేషనల్ టీమ్​కు దూరంగా ఉంటున్నాడు డీకే. భారత తరఫున చివరగా 2022లో అతడు టీ20 మ్యాచ్ ఆడాడు. మరోవైపు అతడ్ని వరల్డ్ కప్ టీమ్​లోకి తీసుకోబోమని ఇన్​డైరెక్ట్​గా హింట్ ఇచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రపంచ కప్​కు వెళ్తున్నాడంటూ ఎగతాళి కూడా చేశాడు. ఇవన్నీ చూస్తుంటే డీకే ఎంత బాగా ఆడినా అది ఆర్సీబీకే పరిమితం అయ్యేట్లు కనిపిస్తోంది. టీమిండియా కోసం అతడి సేవల్ని వినియోగించుకునేందుకు బీసీసీఐ కూడా సిద్ధంగా ఉన్నట్లు అనిపించడం లేదు. ఒకవేళ ఏదైనా మ్యాజిక్ జరిగి అతడు వరల్డ్ కప్​కు వెళ్తే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు బడితపూజ తప్పదు. మరి.. ప్రపంచ కప్​కు డీకే వెళ్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.