iDreamPost
android-app
ios-app

DCకి బిగ్ షాక్.. ఆ ప్లేయర్ సీజన్ మొత్తానికి దూరం..

Delhi Capitals- Ruled Out From IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆట మరింత రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఒక ఆటగాడు పూర్తిగా ఈ సీజన్ కి దూరమయ్యాడు.

Delhi Capitals- Ruled Out From IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆట మరింత రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఒక ఆటగాడు పూర్తిగా ఈ సీజన్ కి దూరమయ్యాడు.

DCకి బిగ్ షాక్.. ఆ ప్లేయర్ సీజన్ మొత్తానికి దూరం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అన్ని జట్లు పోటా పోటీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు టాప్ ప్లేస్ లో కొనసాగుతుంటే.. మరికొన్ని మాత్రం టేబుల్లో ఆఖరి పొజిషన్స్ తో సరిపెట్టుకుంటున్నాయి. అయితే జయాపజయాలను పక్కన పెడితే అన్ని జట్లు తమ శక్తికి మించి పోరాడుతున్నాయి. క్రికెట్ అభిమానులకు అసలైన పొట్టి క్రికెట్ మజాను పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు ప్రమాదాలు, ఆటగాళ్లకు గాయాలు కూడా అవుతూ ఉంటాయి. సీజన్ స్టార్ట్ అవ్వక ముందే కొందరు ఆటగాళ్లు సీజన్ కి దూరమయ్యారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి చెందిన ఒక ప్లేయర్ గాయం కారణంగా ఏకంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి అంతేమీ బాగోలేదు. రిషబ్ పంత్ తిరిగి కెప్టెన్ గా మైదానంలోకి అడుగుపెట్టాడు అనే ఆనందంలో వారిలేదు. అందుకు ఆనంద పడాలో వరుస వైఫల్యాలు, పాయింట్స్ టేబుల్లో ఆఖరి నుంచి మూడో స్థానానికి చేరుకున్నందుకు బాద పడాలో అర్థం కాని పరిస్థితి. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఢిల్లీ బౌలింగ్ యూనిట్ తేలిపోయింది. 266 పరుగులు ఇచ్చుకున్నారు. పైగా 67 పరుగుల భారీ తేడాతో ఓడిపోయారు. ఇలాంటి తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో బ్యాడ్ న్యూస్ దక్కింది. ఒక గాయంతో దూరమైన ప్లేయర్ పూర్తిగా సీజన్ కు దూరమయ్యాడు.

ఆ ప్లేయర్ మరెవరో కాదు.. మిట్చెల్ మార్ష్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మిట్చెల్ మార్ష్ ఈ సీజన్లో నాలుగు మ్యాచులు ఆడాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో మిట్చెల్ మార్ష్ గాయపడ్డాడు. హ్యామ్ స్ట్రింగ్ ఇంజురీతో ఈ సీజన్ కు దూరమయ్యాడు. మిట్చెల్ మార్ష్ గాయానికి చికిత్స కోసం తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అతని రైట్ హ్యామ్ స్ట్రింగ్ లో ఏర్పడిన చిన్న చీలకతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఆ గాయం కారణంగా పూర్తిగా ఐపీఎల్ సీజన్ కి దూరమయ్యాడు. అయితే ఢిల్లీ జట్టు మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా జట్టు కూడా ఇప్పుడు మిట్చెల్ మార్ష్ గాయం విషయంపై బెంగ పెట్టుకుంది. ఎందుకంటే ఇంకో నెలలో టీ20 వరల్డ్ కప్ వస్తుంది అనగా.. మార్ష్ ఇలా గాయం బారిన పడటం వారికి మింగుడు పడటం లేదు. ఈ వార్తతో అటు ఢిల్లీ క్యాపిటల్స్, ఇటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి.. మిట్చెల్ మార్ష్ దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.