iDreamPost
android-app
ios-app

వీడియో: DC బౌలింగ్ మొత్తం ఒకెత్తు.. ఈ రనౌట్ ఒకెత్తు.. మీరు చూశారా?

DC vs GT- Super RunOut: ఐపీఎల్ 2024లో గుజరాత్- ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అద్భుతంగా సాగింది. గుజరాత్ జట్టును కేవలం 89 పరుగలకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ఒక సూపర్ రనౌట్ అందరినీ మెస్మరైజ్ చేసింది.

DC vs GT- Super RunOut: ఐపీఎల్ 2024లో గుజరాత్- ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అద్భుతంగా సాగింది. గుజరాత్ జట్టును కేవలం 89 పరుగలకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ఒక సూపర్ రనౌట్ అందరినీ మెస్మరైజ్ చేసింది.

వీడియో: DC బౌలింగ్ మొత్తం ఒకెత్తు.. ఈ రనౌట్ ఒకెత్తు.. మీరు చూశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అద్భుతమైన రికార్డులు మాత్రమే కాదు.. టీమ్స్ చెత్త రికార్డులను కూడా నమోదు చేస్తున్నాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో అలాంటి రికార్డులే నమోదు అయ్యాయి. ఢిల్లీ జట్టు కేవలం 89 పరుగలకే గుజరాత్ ని ఆలౌట్ చేసింది. అయితే గుజరాత్ జట్టు ఇలా 100లోపు ఆలౌట్ అవ్వడం ఇదే తొలిసారి. గిల్ సేన మొదటి ఓవర్ నుంచి ఢిల్లీ దాటికి తట్టుకోలేకపోయారు. దాదాపుగా సరెండర్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. బౌలింగ్ తోనే కాకుండా.. ఢిల్లీ ఫీల్డింగ్ తో హృదయాలు గెలుచుకున్నారు. ఈ రనౌట్ మాత్రం తప్పకుండా స్పెషల్ అనే చెప్పాలి.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటి నుంచి బంతితో మ్యాజిక్ చేస్తూ పోయింది. వచ్చిన బ్యాటర్ ని వచ్చినట్లు పెవిలియన్ కు పంపింది. ఢిల్లీ బౌలర్లు ఈ మ్యాచ్ లో అద్భుతం చేశారనే చెప్పాలి. మరోవైపు వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. వికెట్స్ వెనుక చిరుత వేగంతో అద్భుతమైన స్టంప్పింగ్స్ రెండు చేశాడు. అలాగే రెండు అద్భుతమైన క్యాచులు పట్టాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు, పంత్ తీసిన వికెట్లు అన్నీ ఒకెత్తు అయితే సుమిత్ కుమార్ చేసిన రనౌట్ ఒకెత్తు అని చెప్పచ్చు. ఎందుకంటే అతను ఎంతో వేగంగా, చిరుతలా దూసుకు వచ్చి బెయిల్స్ గిరాటు వేయడం లైవ్ లో చూసిన ప్రేక్షకులు మంత్ర ముగ్దులైపోయారు.

 అప్పటికే కాస్త క్రీజులో కుదురుకుంటున్న సాయి సుదర్శన్ ని అద్భుతమైన రనౌట్ చేసి పెవిలియన్ కు చేర్చారు. సాయి సుదర్శన్ రనౌట్ హైలెట్స్ లోనే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హైలెట్ గా నిలిచింది. ఆ వీడియో మీరు మిస్ అయితే ఇప్పుడు చూసేయండి. ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాటింగ్ చూస్తే.. సాహా(2), గిల్(8), సాయి సుదర్శన్(12), డేవిడ్ మిల్లర్(2), అభినవ్ మనోహర్(8), రాహుల్ తెవాటియా(10), షారుక్ ఖాన్(గోల్డెన్ డక్), రషీద్ ఖాన్(31), మోహిత్ శర్మ(2), నూర్ అహ్మద్(1), జాన్సన్(1) పరుగులు మాత్రమే చేయగలిగారు.

రషీద్ ఖాన్ కూడా ఫామ్ లోకి రాకపోతే గుజరాత్ కి ఈ మ్యాచ్ పీడకలలా మిగిలిపోయేది. రషీద్ ఖాన్ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డు 89కి చేరింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలింగ్ చూస్తే.. ముఖేశ్ కుమార్ కు 3 వికెట్లు, ఇషాంత్ శర్మ- స్టబ్స్ లకు 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్- అక్షర్ పటేల్ లకు చెరో వికెట్ దక్కింది. తర్వాత బ్యాటింగ్ లో కూడా ఢిల్లీ జట్టు చెలరేగడంతో అద్భుతమైన విజయం దక్కింది. ఈ మ్యాచ్ విన్నింగ్ లో ఎక్కువ క్రెడిట్ పంత్ కే ఇవ్వాలి. సుమిత్ కుమార్ స్టన్నింగ్ రనౌట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.