iDreamPost
android-app
ios-app

విరుష్క దంపతుల కన్నీళ్లు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎమోషనల్ వీడియో!

CSK vs RCB- Virat kohli And Anushka Cryied: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ విజయం అందరినీ ఆనందానికి గురి చేస్తే.. విరాట్ కోహ్లీ- అనుష్క దంపతులు మాత్రం ఏడ్చేసి అందరినీ ఎమోషనల్ చేశారు.

CSK vs RCB- Virat kohli And Anushka Cryied: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ విజయం అందరినీ ఆనందానికి గురి చేస్తే.. విరాట్ కోహ్లీ- అనుష్క దంపతులు మాత్రం ఏడ్చేసి అందరినీ ఎమోషనల్ చేశారు.

విరుష్క దంపతుల కన్నీళ్లు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎమోషనల్ వీడియో!

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కటే పేరు రీసౌండింగ్ వస్తోంది. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ లో ఏదైనా జరగచ్చు అనడానికి ఈ జట్టు ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే వరుసగా 6 మ్యాచుల్లో ఓటమి చవి చూసి.. టేబుల్ లీస్ట్ పొజిషన్ కి వెళ్లిపోయి.. వరుసగా ఆరు విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ కి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి రేర్ ఫీట్ ఆర్సీబీకి మాత్రమే సాధ్యమవుతుంది అనుకోవాలి. ఎందుకంటే వాళ్లు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరు. అందుకే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పుడూ వారిపై నమ్మకాన్ని కోల్పోరు. అంత ఉత్కంఠ భరిత మ్యాచ్ ని విరాట్ కోహ్లీ- అనుష్కా శర్మ ఏడ్చేసి ఫ్యాన్స్ ని కూడా భావోద్వేగానికి గురి చేశారు.

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన చెన్నై- ఆర్సీబీ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను పంచింది. అంతా ఏలాంటి ఫలితం వస్తుందో అని ఇరు జట్ల అభిమానులు ఎదురుచూశారు. టేబుల్ లీస్ట్ పొజిషన్ లో ఉన్నప్పటి నుంచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు రావాలి అని అభిమానులు, టీమ్ కోరుకుంటూనే ఉంది. అందుకే ఆ జట్టు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన తర్వాత అంతా ఎమోషనల్ అయ్యారు. ఆఖరి బంతి మిస్ కాగానే ఆర్సీబీ జట్టు 27 పరుగుల తేడాతో చెన్నై జట్టుపై ఘన విజయం నమోదు చేసిందని క్లారిటీ వచ్చేసింది. ఇంకేముంది ఆర్సీబీ ప్లేయర్స్ అంతా మైదానంలో పరుగులు పెట్టారు. ఫైనల్ గెలిచినంత ఆనందం వారి ముఖాల్లో కనిపించింది.

ఎందుకంటే వాళ్లు ఈ సీజన్లో తొలుత చేసిన ప్రదర్శన కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కసితో ఆడటం ప్రారంభించారు. ఏకంగా వరుసగా 6 మ్యాచుల్లో 6 విజయాలు నమోదు చేసి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. ఒక్క శాతం అవకాశం ఉన్నా కూడా దానిని వంద శాతానికి తీసుకెళ్తాం అంటూ కోహ్లీ చెప్పిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా విజయం తర్వాత మైదానంలో కోహ్లీ- అనుష్క ఎమోషనల్ అయ్యి కనిపించారు. కోహ్లీ గ్రౌండ్ లోనే ఏడ్చేశాడు. గ్యాలరీలో ఉన్న అనుష్క ఫైనల్ బాల్ తర్వాత ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఏడ్చేసింది. ఆమె కళ్లల్లో ఆనందం భాష్పాలు కనిపించాయి. ఆ దృశ్యాలు చూసిన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు కష్టం క్లియర్ గా కనిపిచించింది. ప్లే ఆఫ్స్ కి వెళ్లేందుకు వాళ్లు చేసిన కృషికి అంతా ఫిదా అయిపోయారు. ఎందుకంటే వర్షం పడి ఆగిన తర్వాత బాల్ స్వింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకేముంది డుప్లెసిస్ లాంటి ఆడగాడికే బాల్ కనెక్ట్ కావడం లేదు. స్కోర్ అసలు 180 కూడా దాటదు అనుకున్నారు. కానీ, అంతా కలిసి 218కి చేర్చేశారు. ఇంకేముంది 18 పరుగుల తేడాతే గెలవాలి అనుకున్న మ్యాచ్ ని ఏకంగా 27 పరుగుల తేడాతో గెలిచేశారు. మరి.. కోహ్లీ- అనుష్క దంపతులు ఎమోషనల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.