iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన ధోని.. IPL హిస్టరీలో తొలి ప్లేయర్​గా..!

  • Published May 06, 2024 | 7:54 AM Updated Updated May 06, 2024 | 7:54 AM

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆల్​టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అతడు అందుకున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆల్​టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అతడు అందుకున్నాడు.

  • Published May 06, 2024 | 7:54 AMUpdated May 06, 2024 | 7:54 AM
చరిత్ర సృష్టించిన ధోని.. IPL హిస్టరీలో తొలి ప్లేయర్​గా..!

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు టైమ్ దగ్గర పడుతోంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్​ కీలకంగా మారింది. దీంతో అన్ని జట్లు తప్పక గెలవాలనే కసితో ఆడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా పట్టుదలతో ఆడి విక్టరీ కొట్టింది. పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 28 పరుగుల తేడాతో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన సీఎస్​కే ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్​తో చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోని చరిత్ర సృష్టించాడు.

కెరీర్​లో ఎన్నో రికార్డులను తన పేరు మీద రాసుకున్న ధోని మరో అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్​తో మ్యాచ్​తో ఐపీఎల్ హిస్టరీలో 150 క్యాచులు అందుకున్న తొలి ఆటగాడిగా మాహీ రికార్డు క్రియేట్ చేశాడు. కొత్త పేసర్ సిమర్​జీత్ సింగ్ బౌలింగ్​లో జితేష్ శర్మ (0) ఇచ్చిన క్యాచ్​ను వికెట్ల వెనుక ఉన్న మాహీ అందుకున్నాడు. దీంతో రేర్ ఫీట్​ను అతడు నమోదు చేశాడు. ఇక, ఈ మ్యాచ్​లో కీపర్​గా సక్సెస్ అయిన ధోని బ్యాటింగ్​లో మాత్రం నిరాశపర్చాడు. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు మాహీ.. మాహీ అని చెవులు పగిలిపోయేలా గట్టిగా శబ్దం చేసిన వేళ క్రీజులోకి అడుగుపెట్టాడు ధోని. కానీ ఫేస్ చేసిన ఫస్ట్ బాల్​కే అతడు ఔట్ అయిపోయాడు.

Dhoni's all-time record!

పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్​లో ధోని గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. హర్షల్ ఫుల్ లెంగ్త్​లో వేసిన స్లో డెలివరీని స్లాగ్ స్వీప్ ఆడబోయి మిస్సయ్యాడు మాహీ. అంతే అతడి బ్యాట్​ను దాటుకొని వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. అయితే ధోని ఫెయిలైనా సీఎస్​కే మాత్రం విజయం సాధించింది. ఆ టీమ్ గెలుపులో ఎక్కువ క్రెడిట్ స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాకే ఇవ్వాలి. తొలుత బ్యాటింగ్​లో 26 బంతుల్లో 43 పరుగులతో చెలరేగాడు జడ్డూ. ఆ తర్వాత బంతితోనూ మ్యాజిక్ చేశాడు. 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతడ్నే వరించింది.