Nidhan
వరల్డ్ క్రికెట్లో అత్యంత ప్రమాదకర బౌలర్లలో బ్రెట్‌లీ ఒకడు. బుల్లెట్ వేగంతో అతడు వేసే పేస్ డెలివరీస్‌ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్‌కైనా కష్టమే. బ్రెట్ లీని ఎదుర్కోలేక మహామహా క్రికెటర్లే చేష్టలుడిగారు. కానీ అతడికి ఓ కుర్రాడు పోయించాడని తెలుసా?
వరల్డ్ క్రికెట్లో అత్యంత ప్రమాదకర బౌలర్లలో బ్రెట్‌లీ ఒకడు. బుల్లెట్ వేగంతో అతడు వేసే పేస్ డెలివరీస్‌ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్‌కైనా కష్టమే. బ్రెట్ లీని ఎదుర్కోలేక మహామహా క్రికెటర్లే చేష్టలుడిగారు. కానీ అతడికి ఓ కుర్రాడు పోయించాడని తెలుసా?
Nidhan
బ్రెట్ లీ.. బౌలర్లకు కార్ఖానా లాంటి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ గొప్ప పేసర్. దాదాపు 13 ఏళ్ల పాటు క్రికెట్ దునియాను ఏలాడీ స్పీడ్‌స్టర్. ఒకప్పుడు ఆండీ రాబర్ట్స్, మైకేల్ హోల్టిండ్, జోల్ గార్నర్, మాల్కమ మార్షమ్ వంటి విండీస్ భీకర పేసర్లు బ్యాటర్లను వణికించే వారు. వాళ్ల తర్వాత శకంలో ఆ పనిని బ్రెట్ లీ తన భుజాన వేసుకున్నాడు. చిరుత లాంటి వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చి క్రీజులో జంప్ చేసి అతడు వేసే బంతి మెరుపు వేగంతో వచ్చి బ్యాటర్లను కంగుతినిపించేది. బ్రెట్ లీ బౌన్సర్లకు ఎందరో బ్యాటర్లు గాయాలపాలయ్యారు. రన్స్ చేయడం పక్కనబెడితే అతడ్ని డిఫెండ్ చేసేందుకు కూడా అందరూ భయపడేవాళ్లు. అంతగా క్రికెట్లో డామినేషన్ చూపించిన బ్రెట్ లీని ఓ కుర్రాడు ఉ*చ్చ పోయించాడని మీకు తెలుసా? అతడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పాంటింగ్, గిల్‌క్రిస్ట్, హేడెన్, మెక్‌గ్రాత్, షేన్ వార్న్, సైమండ్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో 2000వ దశకంలో క్రికెట్‌ను ఆస్ట్రేలియా ఏలింది. ఆ టైమ్‌లో టీమ్‌లో మరో లెజెండ్ ఉండేవాడు. అతడే బ్రెట్ లీ. 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో బౌన్సర్లు, యార్కర్లు విసురుతూ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించేవాడతను. తోపు బ్యాటర్లు కూడా అతడ్ని ఎదుర్కొని పరుగులు చేయాలంటే భయపడేవారు. తన బౌలింగ్‌లో అటాక్‌కు దిగితే బౌన్సర్లతో బ్యాటర్లను గాయాలపాలు చేస్తూ వణికించేవాడు బ్రెట్ లీ. అలాంటోడి అహంకారాన్ని అణిచాడో కుర్రాడు. అతడే వెస్టిండీస్ ఏస్ పేసర్ కీమర్ రోచ్. ఆసీస్-విండీస్‌కు మధ్య వన్డే మ్యాచ్‌లో బౌన్సర్‌తో రోచ్‌ను ఇబ్బందికి గురిచేశాడు. బ్రెట్ లీ వేసిన బౌన్సర్ అతడికి తగిలింది. అయితే బ్యాటర్‌కు బంతి తగిలాక సారీ చెప్పాల్సిన ఆసీస్ స్పీడ్‌స్టర్.. క్షమాపణలు కోరకపోగా రోచ్‌ను మరింత రెచ్చగొట్టాడు.
దమ్ముంటే షాట్ కొట్టి చూపించు అంటూ రోచ్‌కు బ్రెట్ లీ సవాల్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన విండీస్ పేసర్ ఆ కోపాన్ని, కసిని బౌలింగ్ సమయంలో చూపించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ టైమ్‌లో బ్రెట్ లీ బ్యాటింగ్‌కు రాగానే బాడీ లెంగ్త్ ఫుల్‌టాస్‌తో విరుచుకుపడ్డాడు. మెరుపు వేగంతో వచ్చిన ఆ బంతి శరీరం పైకి దూసుకురావడంతో షాకైన బ్రెట్ లీ దాన్ని డిఫెన్స్ చేసేలోపు వచ్చి చేతికి బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో తల్లడిల్లాడు. బ్యాట్ పడేసి పిచ్‌లోనే కూర్చుండిపోయాడు. అప్పుడు రోచ్ వచ్చి అతడ్ని పలకరించాడు. అదే ఓవర్లో అతడ్ని క్లీన్ బౌల్డ్ కూడా చేశాడు. ఇది జరిగి చాలా ఏళ్లు అయింది. అయితే క్రికెట్లోని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్‌లో ఒకటైన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. పేస్‌తో అందర్నీ భయపెడుతూ అహంకారానికి పోయిన బ్రెట్ లీని రోచ్ ఆడుకున్న తీరు, అతడికి పోయించిన తీరుకు అప్పట్లో అంతా ఫిదా అయ్యారు.