iDreamPost
android-app
ios-app

టాస్​ విషయంలో BCCI కొత్త ప్రయోగం.. ఇక కాంట్రవర్సీలకు నో ఛాన్స్!

  • Published May 11, 2024 | 9:20 PMUpdated May 11, 2024 | 9:20 PM

ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే భారత క్రికెట్ బోర్డు మరో న్యూ ఎక్స్​పెరిమెంట్​కు తెరలేపిందని తెలుస్తోంది. టాస్ విషయంలో సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైందని సమాచారం.

ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే భారత క్రికెట్ బోర్డు మరో న్యూ ఎక్స్​పెరిమెంట్​కు తెరలేపిందని తెలుస్తోంది. టాస్ విషయంలో సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైందని సమాచారం.

  • Published May 11, 2024 | 9:20 PMUpdated May 11, 2024 | 9:20 PM
టాస్​ విషయంలో BCCI కొత్త ప్రయోగం.. ఇక కాంట్రవర్సీలకు నో ఛాన్స్!

క్రికెట్​లో సరికొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. జెంటిల్మన్ గేమ్ అనే కాదు.. ఏ స్పోర్ట్​లో అయినా ఎక్స్​పెరిమెంట్స్​ జరగాల్సిందే. నూతన ప్రయోగాల ద్వారా గేమ్ చూసే ఆడియెన్స్​, ఫ్యాన్స్​కు సరికొత్త అనుభూతిని ఇవ్వొచ్చు. వాళ్లకు మరింత ఎంటర్​టైన్​మెంట్ అందించొచ్చు. వాళ్ల వ్యూయింగ్ ఎక్స్​పీరియెన్స్​ను మరింత బెటర్​మెంట్ చేయొచ్చు. అదే సమయంలో ఆటగాళ్లకు ఉండే పలు ఇబ్బందుల్ని కూడా తొలగించొచ్చు. నూతన ఆవిష్కరణలు, ప్రయోగాల వల్లే క్రికెట్ కూడా ఇంతగా ఎవాల్వ్ అయిందని చెప్పొచ్చు. భారత క్రికెట్ బోర్డు కూడా న్యూ ఎక్స్​పెరిమెంట్స్​తో ప్రేక్షకులకు కొంగొత్త అనుభూతిని పంచుతుండటం తెలిసిందే. ఈ కోవలోనే మరో ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమవుతోందని సమాచారం.

డొమెస్టిక్ క్రికెట్​లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఎన్నో ఎక్స్​పెరిమెంట్స్ చేసింది బీసీసీఐ. అందులో చాలా మటుకు సక్సెస్ అవడం వల్లే ఐపీఎల్ ఈ స్థాయిలో హిట్ అయిందని చెప్పొచ్చు. మన బోర్డు చేసిన కొన్ని ప్రయోగాలు సక్సెస్ అవడంతో ఐసీసీ కూడా వీటిని ఇంటర్నేషనల్ క్రికెట్​లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మరో సరికొత్త ఎక్స్​పెరిమెంట్​కు భారత బోర్డు రెడీ అవుతోందట. టాస్ విషయంలో కొంగొత్త ప్రయోగానికి సిద్ధమైందట. టాస్ అనేది లేకుండా చేయాలని బీసీసీఐ భావిస్తోందని క్రికెట్ వర్గాల సమాచారం. టాస్ ప్లేస్​లో డైరెక్ట్​గా విజిటింగ్ టీమ్​కు ఆప్షన్స్ ఇవ్వాలనే రూల్​ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది.

తొలుత బ్యాటింగ్ చేయాలా? బౌలింగ్ చేయాలా? అనే ఆప్షన్​ను విజిటింగ్ టీమ్​కు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో ఈ రూల్​ను ప్రయోగించనున్నారని తెలుస్తోంది. మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేయకుండా బ్యాటింగ్, బౌలింగ్​లో ఏదైనా ఎంచుకునే అవకాశాన్ని విజిటింగ్ టీమ్​ కెప్టెన్​కు ఇవ్వనున్నారట. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్​లోని మిగతా టోర్నీల్లో, ఆ తర్వాత రంజీల్లో, అనంతరం ఐపీఎల్​లోనూ దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. బీసీసీఐ కొత్త ఐడియా గనుక సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్​లోనూ ఇక మీదట టాస్ బదులు ఇదే ఫార్ములాను అప్లై చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే కాంట్రవర్సీలకు కూడా చెక్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. టాస్ విషయంలో బోర్డు చేస్తున్న ప్రయోగం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి