iDreamPost
android-app
ios-app

సన్ రైజర్స్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.. మన తెలుగోడే

  • Published May 03, 2024 | 5:14 PM Updated Updated May 03, 2024 | 5:17 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెన్ అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ మ్యాచుల్లో అదరగొడుతున్న సంగతి విదితమే. తన బ్యాటింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అభిషేక్.. ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..?

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెన్ అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ మ్యాచుల్లో అదరగొడుతున్న సంగతి విదితమే. తన బ్యాటింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అభిషేక్.. ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..?

  • Published May 03, 2024 | 5:14 PMUpdated May 03, 2024 | 5:17 PM
సన్ రైజర్స్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..  మన తెలుగోడే

పుష్పతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు పుష్ప-2తో షూటింగ్‌తో బిజీగా మారిపోయాడు. ఆగస్టు 15న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ యేర్నేనీ, యలమంచిలి రవి నిర్మిస్తున్నారు. ఈ సారి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసేందుకు రెడీ అయ్యింది బన్నీ-సుక్కు కాంబో. ఇటీవల విడుదల చేసిన పుష్ప,పుష్ప, పుష్ప రాజ్ సాంగ్ మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న సంగతి విదితమే. అతడు వేసిన హుక్ స్టెప్స్‌కు మరోసారి ఊగిపోతున్నారు ప్రేక్షకులు. బన్నీకి కేవలం మామూలు ప్రేక్షకులే కాదు..క్రికెటర్లు కూడా ఫిదా అయిపోతున్న సంగతి విదితమే.

పుష్పలోని పాటలకు, అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు క్రికెటర్లు కాలు కదిపిన సంగతి విదితమే. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఇండియన్ క్రికెటర్స్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్‌లు పలు సందర్భాల్లో డ్యాన్సులేస్తూ.. ఊగిపోయారు. కాగా, కేవలం డ్యాన్సులతోనే కాదు.. తన నటనతో కూడా బన్నీ క్రికెటర్లను తన మేనియాలో పడేటట్లు చేశాడు. ఇప్పుడు ఓ స్టార్ ఇండియన్ క్రికెటర్‌కు ఆరాధ్య హీరోగా మారిపోయాడు బన్నీ. అల్లు అర్జున్‌ను మెచ్చిన ఆ క్రికెటర్ ఎవరంటే.. అభిషేక్ శర్మ. తాజా ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుఫున ఆడుతూ.. అదరగొడుతున్నాడు. సన్ రైజర్స్ ఓపెనర్ అయిన అభిషేక్.. తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

ఈ పంబాబ్ కుర్రాడికి ఫేవరేట్ హీరో ఎవరంటే.. అల్లు అర్జున్ అని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే బన్నీ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందే అర్థమౌతుంది. పుష్ప తర్వాత అతడి రేంజ్ మారిపోయింది. పాటలకు, డైలాగులకు ఓవరాల్ ఇండియా షేక్ అయిపోయింది. దీంతో అతడు తెలుగులో ఓ స్టార్ సాధించలేని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. జాతీయ అవార్డును అందుకున్న తొలి తెలుగు హీరోగా మారిపోయాడు. అంతే కాకుండా మేడమ్ టుస్సాడ్ మైనపు విగ్రహం కూడా ఏర్పాటు చేసిన సంగతి విదితమే. దుబాయ్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. సినిమా స్టార్ అయిన కొత్తలో వేర్ ఈజ్ ద పుష్ప వీడియోతో సినిమాపై అంచనాలు పెంచేసిన దర్శకుడు సుకుమార్..ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన  టీజర్‌తో ఆ ఎక్స్‌ప్టెషన్స్ పై మరింత హైప్ క్రియేట్ చేశాడు. ఇందులో అమ్మవారి వేషధారణలో అల్లు అర్జున్ మాస్ అవతారంలో కనిపించాడు.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş