Venkateswarlu
Venkateswarlu
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. మనుషులవే కాదు.. జంతువుల మీమ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి వాటిలో ఓ కుక్క మీమ్స్‌కు తెగ క్రేజ్ ఉంది. శిబు బ్రీడ్‌కు చెందిన చీమ్స్ అనే ఆ కుక్క ప్రపంచ వ్యాప్తంగా కామెడీ మీమ్స్‌కు పెట్టింది పేరుగా మారింది. అలాంటి వైరల్ మీమ్ డాగ్ చీమ్ కన్నుమూసింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చీమ్స్ శుక్రవారం చనిపోయింది. అనారోగ్యం నేపథ్యంలో ఆస్పత్రిలో సర్జరీ జరుగుతుండగా చీమ్స్ చనిపోయింది. ఈ విషయాన్ని దాని యజమాని స్వయంగా మీడియాకు వెల్లడించాడు. ఆయన తన పోస్టులో…
‘‘ శుక్రవారం ఉదయం అతడు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. థోరాసెంటిస్ సర్జరీ జరుగుతుండగా ఇది చోటుచేసుకుంది. ఈ సర్జరీ తర్వాత అతడికి కీమోథెరపీ చేయిద్దామని అనుకున్నాము. కానీ, అది కాస్తా లేటయింది. అతడు చనిపోయాడని బాధపడకండి. చీమ్స్ ప్రపంచానికి అందించిన సంతోషాన్ని గుర్తుంచుకోండి. అతడి గుడ్రని నవ్వు ముఖంతో మీకు, నాకు బంధం ఉంది. కరోనా టైంలో చీమ్స్ ఎంతో మంది ముఖాలపై సంతోషం తెచ్చాడు. ప్రస్తుతం అతడి మిషిన్ పూర్తయింది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, చీమ్స్ మరణవార్త తెలిసిన నెటిజన్లు ఆన్‌లైన్ ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
కాగా, హాంకాంగ్ ప్రాంతానికి చెందిన కతి అనే మహిళ శిబు ఇను జాతికి చెందిన చీమ్స్‌ను పెంచుకోవటం మొదలుపెట్టింది. 2010లో చీమ్స్ ఫొటోలు వైరల్ కావటం మొదలైంది. అతడి నగు ముఖం సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. మీమ్స్ వాడకం పెరిగిన తర్వాత చీమ్స్‌పై ఫన్నీ మీమ్స్ రావటం మొదలైంది. అవి ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నాయి. మరి, వైరల్ మీమ్ స్టార్ చీమ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.