iDreamPost
android-app
ios-app

పాఠాలు చెప్పాల్సిన టీచర్.. విద్యార్థితో పాడుపని!

  • Published Jul 02, 2024 | 1:20 PM Updated Updated Jul 02, 2024 | 1:20 PM

School Teacher Arrested: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప స్థాయికి తీసుకు రావాల్సిన కొంతమంది గురువులు దారుణాలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

School Teacher Arrested: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప స్థాయికి తీసుకు రావాల్సిన కొంతమంది గురువులు దారుణాలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

పాఠాలు చెప్పాల్సిన టీచర్.. విద్యార్థితో పాడుపని!

సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంది. పిల్లలను తల్లిదండ్రులు కనీ పెంచినప్పటికీ.. వారికి విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండేలా చేసేది గురువులు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. విద్యార్థులు దారి తప్పితే వారిని సన్మార్గంలో నడిపించేవారే ఉపాధ్యాయులు. అలాంటిది ఈ మధ్య కాలంలో కొంతమంది గురువు స్థానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. పాఠశాలకు మద్యం సేవించి రావడం, సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విద్యార్థులను లైంగికంగా వేధించడం లాంటివి చేస్తున్నారు. విద్యార్థినిపై లైంగిక దాడికి దిగిన ఓ టీచర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు తన విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   ఓ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్న కారణంగా న్యూజెర్సీలోని ఫ్రీహోల్డ్ ఇంటర్మీడియట్ స్కూల్‌లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పనిచేస్తున్న అలిసన్ హావ్‌మెన్ (43)ని పోలీసులు అరెస్ట్ చేశారు.    కాకపోతే.. ఆ విద్యార్థి వయసు, ఏ తరగతికి  అన్న విషయం పోలీసులు గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం అలిసన్ హావ్‌మెన్‌ని మెన్ మిత్ కౌంటీ జైల్లో ఉంచారు. అలిసన్ హావ్‌మెన్ 2008 నుంచి ఉపాధ్యాయురాలిగా వివిధ పాఠశాలల్లో బోధన చేసింది. 2022 నుంచి ఫ్రీహూల్డ్ ఇంటర్మీడియట్ స్కూల్ లో స్పెషల్ ఎడ్యూకేషన్ టీచర్ గా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే ఆమెపై విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా మోన్‌మౌత్ కౌంటీ ప్రాసిక్యూటర్ రేమండ్ ఎస్ శాంటియాగో మాట్లాడుతూ.. లైంగిక వేధింపులకు పాల్పడి.. విద్యార్థి జీవితంతో చెలగాటం ఆడినందుకు అలిసన్ ఉపాధ్యాయురాలికి శిక్ష పడిందని అన్నారు. ఇదిలా ఉంటే అలిసన్ తరుపు న్యాయవాది మాత్రం తన క్లయింట్ అలిసన్ అమాయకురాలు అని.. ఆమెపై లేని పోని నిందలు మోపుతున్నారని వాదిస్తున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతుంది.  ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు.. ఇలాంటి టీచర్ కి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.