Venkateswarlu
Venkateswarlu
బిగ్‌ఫూట్ ఉనికి గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూ ఉంది. బిగ్‌ఫూట్ ఉందని, చూశామని కొందరు అంటుంటే.. మరికొందరు అసలు అలాంటి జీవే లేదని అంటున్నారు. ఇప్పటికే బిగ్‌ఫూట్‌పై చాలా పరిశోధనలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికి వాటిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక, బిగ్‌ఫూట్‌వంటూ చాలా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అవి కూడా ఫేక్ వన్న ప్రచారం ఉంది. ఇలా తరచుగా వార్తల్లో నిలిచే బిగ్‌ఫూట్ మరో సారి తెరపైకి వచ్చింది.
తాజాగా, బిగ్‌ఫూట్‌కు సంబంధించినవంటూ ఓ వీడియో, కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. షనానన్ వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టిన పోస్టు ప్రకారం.. అమెరికాలోని కొలరాడోకు చెందిన షనాన్ పార్కర్, స్టేస్టన్ టేలర్ అనే ఇద్దరు వ్యక్తులు సిల్వర్‌స్టన్ నుంచి డురాంగోకు రైలులో వెళుతున్నారు. ఈ నేపథ్యంలో మార్గం మధ్యలో ఉన్న కొండల్ని షనాన్ తన కెమెరాతో ఫొటోలు తీస్తూ ఉన్నాడు. అప్పుడు గడ్డి మధ్యలో ఓ పెద్ద ఆకారం నడుస్తూ కనిపించింది.
స్టేట్‌సన్ అది ఓ బిగ్‌ఫూట్ అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. షనాన్ పక్కన కూర్చున్న బ్రాండన్ అనే వ్యక్తి వెంటనే తన ఫొన్‌లో ఆ బిగ్‌ఫూట్ వీడియో తీయటం మొదలెట్టాడు. ఆ ట్రైన్‌లో వందల మంది ఉంటే.. ఓ నాలుగురు మాత్రమే దాన్ని చూశారు. అయితే, అది నిజంగానే బిగ్ ఫూటా కాదా? అన్న దానిపై క్లారిటీ లేదు. ఈ వీడియో, ఫొటోలు చూస్తున్న నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి, ఈ వీడియోలు, ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేండి.