iDreamPost
android-app
ios-app

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన UAE..కీలక మార్గదర్శకాలు జారీ!

UAE Start Visa Amnesty Program: ఎంతోమంది భారతీయులు పొట్ట కూటి కోసం సొంత ఊరిని వదిలేసి..గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ఈక్రమంలో వారు అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే తాజాగా వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది యూఏఈ ప్రభుత్వం.

UAE Start Visa Amnesty Program: ఎంతోమంది భారతీయులు పొట్ట కూటి కోసం సొంత ఊరిని వదిలేసి..గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ఈక్రమంలో వారు అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే తాజాగా వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది యూఏఈ ప్రభుత్వం.

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన UAE..కీలక మార్గదర్శకాలు జారీ!

ఎంతో మంది భారతీయులు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు. అయితే ఇలా కుటుంబ కోసం అక్కడి వెళ్లిన కొందరు అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు. అంతేకాక అక్కడి  చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీసా గడువు ముగిసిన తరువాత కూడా అక్కడే ఉండిపోయి.. కూడా అక్కడే ఉండి… ఇబ్బందులకు గురవుతున్నారు. ఈక్రమంలోనే అలాంటి వారికి యూఏఈ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో యూఏఈలో ఉన్న భారతీయులకు భారీ ఊరట లభించినట్లు అయింది. మరి.. ఆ న్యూస్ ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

వీసా గడువు ముగిసిన తరువాత అక్కడే చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో ఛాన్స్ కల్పించింది. వీసా అప్ డేట్ లేదా క్రమబద్దీకరణ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలానే ఎటువంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీసా ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యూఏఈ తీసుకున్న  ఈ కీలక నిర్ణయంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అలెర్ట్ అయ్యింది. యూఏఈలోని ఇండియన్స్ కు సాయం చేసేందుకు స్థానిక భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం సెప్టెంబరు 1న ప్రారంభమై అక్టోబరు 30 వరకు అందుబాటులో ఉండనుంది.

ఈ గడువు కాలంలో పర్యాటకులు, వీసా గడువు ముగిసిన వారు తమ వీసా స్థితిని అప్ డేట్ చేసుకోవచ్చు. అలా చేయలేని పక్షంలో ఎటువంటి జరిమానా, నిషేధాలు, శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్లొచ్చు. యూఏఈలో జన్మించి, సరైన డాక్యుమెంట్స్ లేనివారితో పాటు స్పాన్సర్ల నుంచి తప్పించుకొని అక్కడే ఉంటున్నవారికీ కూడా ఇది వర్తిస్తుందని అక్కడ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దేశంలోకి అక్రమంగా వచ్చిన వారికి మాత్రం ఈ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో దుబాయ్ లోని భారత కాన్సులేట్ పలు విషయాలను వెల్లడించింది.

యూఏఈలో ఉండే భారతీయులు స్వదేశానికి రావాలనుకుంటే.. ఎమర్జెన్సీ సర్టిఫికెటుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అలానే అక్కడే  ఉండాలనుకునేవారు మాత్రం తాత్కాలిక పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలా అప్లయ్ చేసుకున్న మరుసటి రోజే అత్యవసర ధ్రువీకరణ పత్రం తీసుకోవచ్చని తెలపింది. వీటి కోసం దుబాయ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. మరి..యూఏఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.