iDreamPost
android-app
ios-app

Mount Everest: రెండు ఏళ్ళ వయసులో చిన్నారి సంచలనం..ఎవరెస్ట్ ఎక్కి సరికొత్త చరిత్ర!

  • Published Mar 27, 2024 | 1:59 PM Updated Updated Mar 27, 2024 | 1:59 PM

ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం హిమాలయాలలో ఉన్న మౌంట్ ఎవరెస్ట్. ప్రపంచ పర్వతారోహకులు.. వారి జీవితంలో ఒక్కసారైనా ఈ శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా భావిస్తూ ఉంటారు. అయితే, దీనిని ఓ రెండున్నరేళ్ల చిన్నారి అధిరోహించి .. అందరికి ఆశ్చర్యాన్ని కలిగించి.. వార్తల్లో నిలిచింది.

ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం హిమాలయాలలో ఉన్న మౌంట్ ఎవరెస్ట్. ప్రపంచ పర్వతారోహకులు.. వారి జీవితంలో ఒక్కసారైనా ఈ శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా భావిస్తూ ఉంటారు. అయితే, దీనిని ఓ రెండున్నరేళ్ల చిన్నారి అధిరోహించి .. అందరికి ఆశ్చర్యాన్ని కలిగించి.. వార్తల్లో నిలిచింది.

  • Published Mar 27, 2024 | 1:59 PMUpdated Mar 27, 2024 | 1:59 PM
Mount Everest: రెండు ఏళ్ళ వయసులో  చిన్నారి సంచలనం..ఎవరెస్ట్ ఎక్కి సరికొత్త చరిత్ర!

ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టును అధిరోహించాలంటే.. అది చాలా కష్టతరమైన పని. దీనిని అధిరోహించాలని ఆ రికార్డ్స్ లో తమ పేరు నమోదు చేసుకోవాలని.. ఎంతో మంది దానిని తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు. మౌంట్ ఎవరెస్టు ను అధిరోహించాలంటే కేవలం అనుకుంటే సరిపోదు.. అక్కడ క్షణాల్లో మారిపోయే వాతావరణ పరిస్థితులను తట్టుకోగలగాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితులను తట్టుకుంటూ.. ముందుకు సాగడానికి.. పెద్దవారు సైతం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరెస్ట్ ను అధిరోహించడం అంటే చాలా సవాల్ తో కూడుకున్న పని.. ఇప్పటికే ఎంతో మంది పర్వతారోహకులు దీనిని అధిరోహించి వార్తల్లో నిలిచారు. అయితే, వారంతా పెద్దవారు. కానీ, ఒక రెండున్నరేళ్ల చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని.. అధిరోహించిందంటే నమ్మగలమా ! అవును భోపాల్‌కు చెందిన సిద్ధి మిశ్రా అనే చిన్నారి.. ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భోపాల్‌కు చెందిన మహీం మిశ్రా, భావన దేహరియ దంపతుల కుమార్తె.. సిద్ధి మిశ్రా. 2019లో ఈ జంట ఎవరెస్ట్‌ను అధిరోహించారు. ఇక ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఈ చిన్నారి.. సిద్ధి మిశ్రా మార్చి 22న సిద్ధి మిశ్రా ఎవరెస్ట్‌ను అధిరోహించింది. హిమాలయ పర్వతాలలోని ఎవరెస్ట్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న.. నేపాల్లోని లక్లా నుంచి మార్చి 12న ఈ కుటుంబం యాత్రను మొదలుపెట్టింది. కేవలం పది రోజుల్లోనే.. 53 కి.మీల దూరాన్ని పూర్తి చేసి వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విషయాన్నీ ఎక్స్‌పెడిషన్ హిమాలయ కంపెనీ ఎండీ నబీన్ త్రితాల్ ప్రకటించారు. అంతేకాకుండా .. “రెండున్నరేళ్ల వయసులో ఎక్స్‌పెడిషన్ హిమాలయ సంస్థ సాయంతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు (ఈబీసీ) చేరుకున్న తొలి చిన్నారి సిద్ధి” అని కూడా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక రెండున్నరేళ్ల తన కూతురు సిద్ది మిశ్రాతో కలిసి ఎవరెస్ట్ ను అధిరోహించిన విషయమై.. ఆమె తల్లి భావన దేహరియ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, భావన ఈ విషయమై మాట్లాడుతూ.. ” ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అనిపించినంత సులభం కాదు.. కానీ గిన్ని (సిద్ధి) దానిని విజయవంతంగా పూర్తిచేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ గమ్యాన్ని చేరుకోవడానికి పూర్తి అభిరుచిని ప్రదర్శించింది.” అని భావన పేర్కొన్నారు. భావన దేహరియ విషయానికొస్తే.. ఆమె మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు చెందిన మహిళ. చిన్నతనం నుంచి కూడా ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిఖరాలను ఎక్కాలనే లక్ష్యంతోనే అడుగులు వేస్తూ వచ్చింది.

ఇక ఈసీబి విషయానికొస్తే.. బేస్ క్యాంప్‌లోని అత్యంత ఆశ్చర్యకరమైన అంశాలలో ఒకటి.. ఒక కొత్త ల్యాండ్‌మార్క్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే ఫోటోలతో సందర్శకులను స్వాగతించే సైన్‌బోర్డ్. ఇది గ్రాఫిటీతో కప్పి ఉన్న బండరాయి. ఇది సంవత్సరాలుగా బేస్ క్యాంప్‌నకు అధికారిక రాకను సూచిస్తుంది. గతంలో అంటే ఈ ఏడాది ఆరంభంలోనే.. స్కాట్లాండ్కు చెందిన రెండేళ్ల చిన్నారి కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకుంది. ఆమెను తన తండ్రి వీపుపై మోస్తూ పర్వతారోహణ చేశారు. ఇక ఇప్పుడు సిద్ధి మిశ్రా ఈ ఎవరెస్టును అధిరోహించి.. అతిపిన్న వయస్సులోనే ఎవరెస్టు బేస్ క్యాంపునకు చేరిన భారతీయ చిన్నారిగా రికార్డు నెలకొల్పింది. దీనితో ఈ చిన్నారిని అందరు ప్రశంసలతో ముంచేస్తున్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.