iDreamPost
android-app
ios-app

సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

జపాన్‌ దేశానికి మళ్లీ గడ్డు పరిస్థితి మొదలైంది. అక్కడి ప్రజలు సునామీ భయంతో బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. జపాన్ ఈస్ట్ కోస్ట్ ఏరియాలోని ఇజూ ఐస్ ల్యాండ్స్‌లోని సముద్రంలో తాజాగా భారీ భూకంపం సంభవించింది.  ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6గా నమోదైంది. సముద్రంలో 10 కిలీమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో భారీ భూకంపం వచ్చిన నేపథ్యంలో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ మహా సముద్రం తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నట్లు వారు తెలిపారు. పలు ప్రాంతాల్లో అలలు 3నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించారు. సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు. తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ఈ సునామీ కారణంగా పెద్దగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. మరి, జపాన్‌ దేశంలో సునామీ వచ్చే అవకాశం ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.