iDreamPost
android-app
ios-app

యాత్రికుల బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 25 మంది మృతి!

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగి పోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తులో వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన టూరిస్టు బస్సు ప్రమాదంలో 25 మంది దుర్మరణం చెందారు.

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగి పోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తులో వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన టూరిస్టు బస్సు ప్రమాదంలో 25 మంది దుర్మరణం చెందారు.

యాత్రికుల బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 25 మంది మృతి!

ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, మద్యం మత్తులో వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి వివిధ కారణాలతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో చీకటిని నింపుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది దుర్మరణం చెందారు. యాత్రికుల బస్సును ట్రక్కు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళుతున్న మినీబస్సు ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో 25 మంది దుర్మరణం చెందారు. అలానే ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బ్రెజిల్లోని  లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా- గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయాక చర్యలు చేపట్టారు.

రాత్రివేళ ప్రమాదం జరిగిందని రాష్ట్ర స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్‌పోస్ట్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ప్రమాదాంలో గాయపడిన వారిని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. ఎక్కువ మంది బాధితులు మినీబస్సులో ఉన్నారని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బహియా సివిల్ పోలీసులు తెలిపారు. ఇలా నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  మన దేశంలోనూ నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవలే ఏపీలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ఆరు మంది దుర్మరణం చెందారు. అలానే తెలంగాణలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బంధువులు ఐదు మంది మృతి చెందారు. ఇలా దారుణమైన రోడ్డు ప్రమాదాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బ్రెజిల్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 25 మంది మృతి చెందడం అందరిని కలచివేస్తుంది.  మరి.. ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.