iDreamPost
android-app
ios-app

అమెరికాని వణికిస్తున్న వార్త! గ్రహణ భయంతో భర్త, పిల్లలను చంపేసిన జ్యోతిషురాలు!

  • Published Apr 12, 2024 | 1:38 PM Updated Updated Apr 12, 2024 | 1:38 PM

Los Angeles Crime News: నేటి సమాజంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది.. ఎన్నో విప్లవాత్మక మార్పులు సాధించాం. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ మూఢ విశ్వాలతో జనాలు భయపడిపోతున్నారు.

Los Angeles Crime News: నేటి సమాజంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది.. ఎన్నో విప్లవాత్మక మార్పులు సాధించాం. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ మూఢ విశ్వాలతో జనాలు భయపడిపోతున్నారు.

  • Published Apr 12, 2024 | 1:38 PMUpdated Apr 12, 2024 | 1:38 PM
అమెరికాని వణికిస్తున్న వార్త! గ్రహణ భయంతో భర్త, పిల్లలను చంపేసిన జ్యోతిషురాలు!

మనిషి తన మేథస్సుతో సాంకేతిక రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. కమ్యూనికేషన్, వైద్య రంగం ఇతర ఎన్నో రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఎన్ని విజయాలు సాదించినా.. ఇప్పటికీ మూఢ విశ్వాలపై నమ్మకాన్ని పోగొట్టుకోలేపోతున్నారు. మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు, చేతబడి అంటూ మూఢ విశ్వాసంతో బతికేస్తున్నాడు. మంత్రాలు, పూజలు అంటూ  ప్రజలను కొంతమంది మంత్రగాళ్లు, బాబాలు మోసం చేస్తూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షుద్ర పూజల కోసం నర బలి కూడా ఇస్తున్నారు. ఆమె ఓ జ్యోతిష్యురాలు.. ఎంతోమందికి జాతకాలు చెప్పే ఒక్క విషయంలో భయపడి కట్టుకున్న భర్త, కన్న పిల్లలను హతమార్చింది. ఇంతకీ ఆమెను భయపెట్టిన విషయం ఏంటీ? ఎందుకు ఆమె హత్యలు చేసింది? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఒక భయాణక సంఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భర్త, కన్న పిల్లలను హత్య చేసిన కేసులో  ప్రముఖ జ్యోతిష్యురాలు డేనియల్ జాన్సన్(34) ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అసలు ఏం జరిగిందంటే.. డేనియల్ జాన్స్ ఆన్ లైన్ లో జాతకాలు చెబుతూ మంచి పేరు సంపాదించింది. ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పే ఆమె గ్రహణానికి భయపడింది. దక్షిణ కాలిఫోర్నియాలో సూర్య గ్రహనం ఏర్పడింది. జ్యోతిష్యురాలైన డేనియల్ సూర్య గ్రహణానికి భయపడింది. ఈ గ్రహణం ఎంతో శక్తివంతమైనది.. ఇప్పడే మేల్కోండి గ్రహణం ఏర్పడుతుంది.. కొత్త ప్రపంచం వస్తుంది. ఏం చేయాలన్నా ఇదే మంచి సమయం అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

పోస్ట్ పెట్టిన కొద్ది సమయానికి డేనియల్ జాన్సన్ తన భర్తను హత్య చేసింది. భర్త మృతదేహాన్ని కారులో దాచి తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని కారులో బయలుదేరింది. 160 స్పీడ్ తో ప్రయాణిస్తున్న సమయంలో తన 8నెలల చిన్నారిని కారు లో నుంచి బయటకు విసిరింది. పాప అక్కడిక్కడే మృతి చెందింది. అది చూసి 9 ఏళ్ల మరో కూతురు భయంతో వణికిపోయింది. డేనియల్ కారును అదే స్పీడ్ తో నడుపుతూ చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కూతురితో పాటు ఆమె కూడా కన్నుమూసింది.ఈ ప్రమాదంలో డేనియల్ శరీరం ఛిత్రమైపోయింది. పోలీసులు డేనియల్ ని గుర్తించేందుకు చాలా సమయం పట్టింది. డేనియల్ జాన్సన్ ని ఆన్ లోన్ లో డేనియల్ అయోకాగా పిలుస్తారని ఆమె జ్యోతిష్యురాలని గుర్తించారు. మూఢ విశ్వాల కారణంగా ఒక కుటుంబం అంతమైందని పోలీసులు తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom