iDreamPost
android-app
ios-app

ఆ పనిచేస్తే మెచ్చుకోలేదని భర్తపై భార్య దారుణం!

  • Published Jul 03, 2024 | 2:01 PM Updated Updated Jul 03, 2024 | 2:01 PM

America Crime News: అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు అలకలు సర్వసాధారణం. ఆ అలకలు కొన్నిసార్లు చిలికి చిలికి గాలివానగా మారి పెను వివాదాలకు తెరలేపుతున్నాయి.

America Crime News: అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు అలకలు సర్వసాధారణం. ఆ అలకలు కొన్నిసార్లు చిలికి చిలికి గాలివానగా మారి పెను వివాదాలకు తెరలేపుతున్నాయి.

ఆ పనిచేస్తే మెచ్చుకోలేదని భర్తపై భార్య దారుణం!

ఇటీవల కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై ఎదుటివారిపై దాడులు చేయడం లేదా ఆత్మహత్యలకు పాల్పపడం చూస్తూనే ఉన్నాం. పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట ఏడాదిలోపే విడాకులు తీసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి. చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఆదిపత్య పోరు, వివాహేతర సంబంధాల కారణంగా గొడవలు జరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, హత్యలు చేయడం వరకు వెళ్తున్నాయి. తాను చేసిన పనిని భర్త మెచ్చుకోలేదని భార్య దారుణానికి తెగబడింది. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు రావడం చూస్తూనే ఉంటాం. ఒకప్పుడు భర్తల చేతిలో భార్యలు ఇబ్బందులు ఎదుర్కొన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తే.. ఇప్పుడు భార్య చేతిలో భర్తల అగచాట్లకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాలంలో భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగం, వ్యాపారాలు చేయడంతో ఇరువురి మధ్య ఆదిపత్య పోరు మొదలై అది కాస్త విభేదాలకు దారి తీస్తున్నాయని అంటున్నారు.  వాటికి తోడు వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. తాజాగా భర్త తాను చేసిన పనిని మెచ్చుకోలేదని కోపంతో భార్య దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని మిస్సోరిలో ఓ మహిళ తన భర్త బర్త్ డే పార్టీ విషయంలో వచ్చిన కోపంతో అతన్ని చంపడానికి ప్లాన్ వేసింది. భర్త తాగే కూల్ డ్రింక్ లో ‘రౌండ్ అప్’ అనే క్రిమిసంహారక మందు కలిపినట్లు భర్త ఆరోపించాడు.ఇటీవల ఫ్రిజ్ లో ఉంచి కూల్ డ్రింగ్ లో విచిత్రమైన రుచి ఉందని, దాన్ని తాగిన తర్వాత వాంతులు, విరోచనాలు మొదలయ్యాయని భర్త పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలించగా విస్తుతపోయే నిజం వెలుగులోకి వచ్చింది. తన భార్య కూల్ డ్రింగ్ ఓపెన్ చేసి అందులో రౌండ్ అప్ అనే క్రిమిసంహారక మందు వేసి ట్యాంపరింగ్ చేస్తున్నట్లు గమనించాడు. దీనిపై భార్యను వివరణ కోరగా ఈ మధ్య తన భర్త 50వ పుట్టిన రోజు ఎంతో కష్టపడి అన్ని ఏర్పాట్లు చేస్తే కనీసం తనకు థ్యాంక్స్ కూడా చెప్పలేదని, తనని మెచ్చుకోలేదన్న కోపంతో ఈ పని చేసినట్లు పోలీసులు చెప్పడంతో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişmarsbahis