Arjun Suravaram
Jensen Huang: కల సాకారం కావాలంటే అంత సులభం కాదు. ఏపని అయినా కష్టపడి చేయడానికి సిద్ధపడాలి. లక్ష్యం మీదే గురి పెట్టి, నిరంతర ప్రయత్నం, అంకిత భావం పని చేస్తే.. ఎంతటి పేదరికంలో ఉన్నా.. విజయతీరాలకు చేరగలరు. అలా చేసి అందరికి స్ఫూర్తిగా నిలిచారు ఓ వ్యక్తి.
Jensen Huang: కల సాకారం కావాలంటే అంత సులభం కాదు. ఏపని అయినా కష్టపడి చేయడానికి సిద్ధపడాలి. లక్ష్యం మీదే గురి పెట్టి, నిరంతర ప్రయత్నం, అంకిత భావం పని చేస్తే.. ఎంతటి పేదరికంలో ఉన్నా.. విజయతీరాలకు చేరగలరు. అలా చేసి అందరికి స్ఫూర్తిగా నిలిచారు ఓ వ్యక్తి.
Arjun Suravaram
ప్రతి మనిషికి కలలు అనేవి ఉంటాయి. అయితే వాటిని సాకారం చేసుకునేది మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కలలే కంటారు. వాటిని నిరవేర్చుకునే ప్రయత్నం చేసేవారు మాత్రం అతి కొద్ది మందే ఉంటారు. ఇక కొందరు అయితే తమ కలను సాకారం చేసుకునే వరకు అసలు నిద్రపోరు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వెంటాడిన కూడా తమ కలను నిర్చేకునేందుకు కృషి చేస్తుంటారు. అలా అంకింత భావంతో పని చేసి..విజయ తీరాలకు చేరిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఎన్ విడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్స్ ఒకరు. ఆయన సక్సెస్ స్టోరీ అందరికి ఆదర్శం.
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఆదరణ పెరుగుతోంది. చాలా సంస్థలో ఏఐతో నే ఎక్కువ శాతం పనులు జరుగుతున్నాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏఐకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్ విడియా పేరు మారుమోగిపోతుంది. దీని షేరు విలువ ఏడాదికి 70 శాతం వృద్ధితో దూసుకెళ్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు సీఈవో జెన్సన్ హువాంగ్ సంపాదన గణనీయంగా పెరిగింది. ఫోర్బ్స్ ప్రకారం, హువాంగ్ 72.2 బిలియన్ల డాలర్ల నికర విలువతో ప్రపంచంలో 20వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.
స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో”వ్యూ ఫ్రమ్ ది టాప్” ఇంటర్వ్యూలో స్వయంగా ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. అయితే ఈయన నేడు అందరికి ఓ బిలినీయర్ గా మాత్రమే గుర్తు.. కానీ ఒకప్పుడు మాత్రం ఎన్నో కష్టాలు పడ్డారు. ఆఖరికి టాయిలెట్లను కూడా శుభ్రం చేశాడు. అదే విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. తాను కడిగిన గిన్నెలు, శుభ్రం చేసినని టాయిలెట్లు బహుశా ఎవరు చేసి ఉండరని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
గత నెలలో స్టాన్‌ఫోర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ పాలసీ రీసెర్చ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంలో హువాంగ్ విద్యార్థులకు కీలక సూచనలు అందించారు. అంచనాలు మరీ ఎక్కువ ఉండకూడదు కానీ ఎదురుదెబ్బలు , బాధలను తట్టుకునే సామర్థ్యమే ఉండటం మాత్రం ముఖ్యమని హువాంగ్ అభిప్రాయపడ్డారు. నిజమైన గొప్పతనం కష్టనష్టాల నుంచి అనుభవాల ద్వారా వస్తుందని, బాధలు పడాలి.. అపుడే విజయం అని తాను నమ్ముతాననీ ఆయన విద్యార్థులకు సూచించారు.
జెన్సన్ హువాంగ్ 1963లో తైనాన్‌లో జన్మించారు. ఐదేళ్ల వయసులోనే అతని కుటుంబం థాయిలాండ్‌కు వలస వెళ్లింది. హువాంవా చదువుకునే రోజుల్లోనే డెన్నీ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పని చేశారు. అలా 1993లో క్రిస్ మలాచోస్కీ అండ్ కర్టిస్ ప్రీమ్‌లతో కలిసి ‘ఎన్‌విడియా’ (Nvidia) స్థాపించారు. అప్పటినుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం వేల కోట్లసంపదతో ప్రపంచంలో టాప్ బిలియనీర్ల సరసన నిలబడి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. పట్టుదలతో, అంకితభావంతో శ్రమిస్తే.. విజయం తథ్యం అని ఆయన నిరూపించారు.